Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ 'నోటా'.. ప్రశంసలతో పాటు విమర్శలు!

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ మరో హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశ పడ్డారు. విజయ్ తన కెరీర్ ఆరంభంలోనే రాజకీయ నేపధ్యం గల సినిమా ఎన్నుకొని పెద్ద సాహసం చేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. 

divide talk for vijay devarakonda nota movie
Author
Hyderabad, First Published Oct 5, 2018, 9:49 AM IST

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ మరో హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశ పడ్డారు. విజయ్ తన కెరీర్ ఆరంభంలోనే రాజకీయ నేపధ్యం గల సినిమా ఎన్నుకొని పెద్ద సాహసం చేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి.

ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందనే విషయంపై భినాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.  ఓవర్సీస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కురిపిస్తున్నారు. విజయ్ కెరీర్ లో ఇదొక ఏవరేజ్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

తమిళ వాసన ఎక్కువ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా రుచించదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. విజయ్ ఈ సినిమా కథ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని దెప్పిపొడుస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమాలో డైలాగ్స్ బాగున్నాయని, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా  ఉన్నాయని అంటున్నారు.

సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా కనెక్ట్ అవ్వడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీని డైరెక్టర్ కొత్తగా చూపించారని, యూత్ కి ఈ ఎలిమెంట్ నచ్చుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చినట్లు స్పష్టమవుతోంది! 

ఇవి కూడా చదవండి..

'నోటా' ట్విట్టర్ టాక్.. అభిమానుల పెదవి విరుపులు!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

Follow Us:
Download App:
  • android
  • ios