వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

First Published 25, Mar 2018, 10:42 AM IST
new feature in whatsup just update your whatsaap
Highlights
  • అదిరిపోయే ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ వచ్చింది. వాట్సాప్ అప్ డేట్ చేసుకున్నవారికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటో తెలుసా..? ఇక నుంచి వాట్సాప్ లో లొకేషన్ ని స్టిక్కర్స్ రూపంలో పంపించుకోవచ్చు.

ఇంతకు ముందు యూజర్లు గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా లోకేషన్‌ షేర్‌ చేసుకునే వారు. అయితే ఆ అవసరం లేకుండా.. ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్‌(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని వాట్సాప్‌ ఓ ప్రకటనలో సూచించింది.

దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్‌ సౌకర్యాన్ని కూడా వాట్సాప్‌ కల్పించిన విషయం తెలిసిందే.

loader