కోర్టులో వెంటాడి భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Man Chases Wife Inside Odisha Court, Kills Her With Sword
Highlights

కోర్టులో వెంటాడి భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

ఒడిశా: ఒడిశాలోని ఫ్యామిలీ కోర్టులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కోర్టులోనే తన భార్యను వెంటాడి కత్తితో పొడిచి చంపాడు. సోమవారం జరిగిన ఈ దాడి ఘటనలో ఆమె తల్లి, మరో సమీప బంధువు గాయపడ్డారు. 

ఒడిశాలోని సంబాల్పూర్ లోని సింధూర్ పంఖ్ కు చెందిన రమేషథ్ కంభార్ అనే వ్యక్తి తన 18 ఏళ్ల భార్య సంజిత చౌధురిపై కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె మరణించింది. 

అత్త లలిత చౌధురి, రెండున్నరేళ్ల చిన్నారి గాయపడ్డారు. దాడి నుంచి అతని మామ మాత్రం పారిపోయి తప్పించుకున్నాడు. తన వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత సంజిత తన పుట్టింటికి వచ్చింది. ఇరువురి మధ్య వివాదానికి సంబంధించి రాజీ ప్రయత్నాలు కోర్టులో ప్రారంభమయ్యాయి.

సంజిత తన తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు వచ్చింది. నిజానికి సంజిత నిరుడు రమేష తో కలిసి పారిపోయి కొన్ని నెలల పాటు కలిసి జీవించింది. భర్త వేధింపులను తట్టుకోలేక, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. 

తన భార్యను తిరిగి తెప్పించుకోవడానికి ఫ్యామిలీ కోర్టులో రమేష్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, అతను పక్కా ప్రణాళిక ప్రకారం భార్యపై దాడి చేసినట్లు చెబుతున్నారు.

కోర్టులో ఉన్నవారు రమేష్ ను పట్టుకుని చితకబాది, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.  
 

loader