ఎపి సిఐడికి డిజిపి సాంబశివరావు ఆదేశాలు
ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అని ఆయన రాసిన పుస్తకం తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలాఉందని .కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని పలు ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేయడంతో డిజిపి ఈ ఆదేశాలుజారీ చేశారు. రాష్ట్ర సీఐడీ అధికారులకు ఈ ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శాంతిభద్రతల గురించి చర్చించారు. అనంతరం డీజీపీ రాష్ట సిఐడి అధికారులకు ఆదేశాలుజారీ చేశారు. ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి
