హైదరాబాద్ అల్వాల్ నారాయణ స్కూల్ లో  మరొక దుర్మార్గొ బయటపడింది.   నాల్గవ తరగతి చదువుతున్న న్యూటన్ అనే బాలుడు హోంవర్క్ చేయలేదని  మహాలక్ష్మి అనే కంప్యూటర్ టీచర్ విషక్షణా రహితంగా బాదినట్లు బయటకు పొక్కింది. ఆమె న్యూటన్ ను ఎంత తీవ్రంగా కొట్టిందంటే  దీనితో బాలుడి తలకు తీవ్ర గాయాలు తగిలి నాలుగు కుట్లు కూడా పడ్డాయి. అంతేకాదు, ఈ విషయం బయటకుపొక్కడంతో రాజీ బేరాలు మొదలుపెట్టారు. రాజీ కుదుర్చు కోమని బాలుడి తండ్రి శివకుమార్ ను స్కూల్ ఇంచార్జీ మధుసూదన్ వత్తిడి తెస్తున్నట్లు తెలియ వచ్చింది.
ఈ ఘటనను  బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ కి  స్థానిక అల్వాల్ ఇన్స్పక్టర్ కి ఫిర్యాదు ఈ అమానుష శిక్ష మీద ఫిర్యాదు చేసి స్కూల్ యాజమాన్యం పై జె జె 75 ప్రకారం నిందితురాలు మహాలక్ష్మి పై హత్యయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరింది. పిల్లల పట్ల టీచర్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారనీ ఈ నారాయణ స్కూల్ ను వెంటనే మూసివేయాలని బాలల హక్కుల సంఘం  గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు  డిమాండ్ చేస్తున్నారు.