Asianet News TeluguAsianet News Telugu

శృంగారంలో వెనకపడ్డారా..ఈ ఫుడ్స్ తీసుకోండి

  • మీ సెక్సువల్ లైఫ్ ని మరింత ఆనందంగా గడపాలి అనుకుంటే..కొన్ని రకాల ఫుడ్స్ అవసరం
7 Foods for Better Sex

ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇది సహజం. వారు అలా ఉండాలంటే వారి మధ్య సెక్సువల్ లైఫ్ కూడా అంతే సంతోషంగా ఉండాలి. అప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది. మీ సెక్సువల్ లైఫ్ ని మరింత ఆనందంగా గడపాలి అనుకుంటే..కొన్ని రకాల ఫుడ్స్ అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అవకాడో..

7 Foods for Better Sex

 ఈ అవకాడో పండు మీ సెక్సువల్ లైఫ్ కి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు రెగ్యులర్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగానూ, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ ఉంటాయి. దీంతో ఇవి తీసుకోవడం వల్ల  గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. రక్త సరఫరా కూడా సరిగా జరుగుతుంది.

బాదంపప్పు..

7 Foods for Better Sex

బాదంపప్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే.. ఇది సెక్స్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మినరల్స్, ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో జింక్, విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా సెక్సువల్ స్ట్రెంత్ పెరగడానికి దోహదం చేస్తాయి.

స్ట్రాబెర్రీస్..

7 Foods for Better Sex

ఎరుపు రంగుకి ఆకర్షణ చాలా ఎక్కువ. ఆడవాళ్లు ఎరుపు రంగు ధరిస్తే.. మగవాళ్లు త్వరగా ఆకర్షితులౌతారట. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా ఎరుపు రంగులోనే ఉండి ఆకర్షిస్తుంటాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. మగవారిలో వీర్యకణాల పెరగడానికి స్ట్రాబెర్రీస్  ఉపయోగపడతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

సీ ఫుడ్..

7 Foods for Better Sex

జలచర జీవులు అదేనండి.. చేపలు,రొయ్యలు, పీతలు లాంటివి కూడా సెక్యువల్ లైఫ్ లీడ్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా నత్త గుల్లలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ జలచరాల్లో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

అరుగుల ఆకు..

7 Foods for Better Sex

ఈ అరుగుల ఆకు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తరచూ తీసుకోవడం వల్ల సెక్సువల్ హెల్త్ అభివృద్ధి చెందుతుంది.

 అత్తిపండు..

అత్తిపండు ఎప్పుడైనా రుచి చూశారా..? బహుషా ఈ పండును రుచి చూసినవాళ్లు  చాలా తక్కువ మందే ఉంటారు. చాలా అరుదుగా లభించే ఈ పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె పనితీరుకి సహాయం చేస్తుంది.

నిమ్మజాతి పండ్లు..

7 Foods for Better Sex

నిమ్మకాయ, బత్తాయి, నారింజ లాంటివన్నింటినీ నిమ్మజాతి పండ్లు అంటారు. వీటిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్  ఎక్కువగా ఉంటాయి. ఇవి పురుషల్లో రీప్రొడక్టివిటీ హెల్త్ పెరుగుదలకు సహాయం చేస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios