Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: పోటీపై తేల్చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

 వచ్చే ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉంటానని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన చెప్పారు.

Wont Contest UP Election Next Year, Says Akhilesh Yadav
Author
Uttar Pradesh, First Published Nov 1, 2021, 2:30 PM IST

లక్నో:వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎస్పీ చీఫ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Akhilesh Yadav ప్రకటించారు.వచ్చే ఏడాది Uttar Pradesh రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తుందని ఆయన చెప్పారు.అయితే ఆర్ఎల్‌డీతో సీట్ల పంపకం జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీలోని ఆజంఘడ్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ తరుపున ఆయన సీఎం అభ్యర్ధి.

also read:మాఫియా, బాహుబలులకు టికెట్లు ఇవ్వం.. అందుకే ఆయనను మార్చాం: మాయావతి సంచలనం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసేందుకు ఆయన విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ  ఇతర పార్టీలతో పొత్తులపై కేంద్రీకరించింది.  ఓంప్రకాష్ రాజ్‌భర్ కు చెందిన సుహెల్ దేవ్ కి చెందిన భారతీయ సమాజ్ పార్టీతో ఎస్పీ ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొంది. తాజాగా ఆర్ఎల్‌డీతో కూడా ఆ పార్టీకి ఎన్నికల ఒప్పందం కుదిరింది.

ఎస్పీ నుండి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకొన్న బాబాయ్ శివపాల్ సింగ్ నేతృత్వంలోని ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియాతో కూడా ఎన్నికల పొత్తులకు తమకు ఇబ్బంది లేదని ఆయన ప్రకటించారు. శివపాల్ సింగ్  తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులకు తగిన గౌరవం ఇస్తామని ఆయన అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో  బీజేపీపై  ఎదురు దాడికి దిగుతున్నారు. బీజేపీ సర్కార్ యూపీ ప్రజలను లూటీ చేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకు పోతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

గత వారంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ  ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు ఆ పార్టీ గాలం వేస్తోంది. మరో వైపు ఆయా ప్రాంతాల్లోని బలమైన పార్టీలతో  పొత్తులకు కూడా సమాజ్‌వాదీ పార్టీ సిద్దమైంది.

గత ఎన్నికల సమయంలో శివపాల్ సింగ్  ఎస్పీలో ఉన్నాడు. ఎన్నికల తర్వాత శివపాల్ సింగ్ ఎస్పీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొన్నాడు. అయితే ఈ దఫా శివపాల్ సింగ్ పార్టీతో కూడా పొత్తుకు తాను సిద్దమనే సంకేతాలను ఇచ్చాడు  అఖిలేష్ యాదవ్..గతంలో  అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు ఆయన మండలి సభ్యుడిగానే కొనసాగాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఆజంఘడ్ నుండి ఎంపీగా విజయం సాధించాడు.వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తే అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios