ఢిల్లీలో ఆక్రమణ తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న మహిళలు పోలీసులపై ఆగ్రహం చేశారు. తమతో తెచ్చుకున్న కారం పొడిని చల్లారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీలోని మెహ్రౌలీలో చేపడుతున్న ఆక్రమణల తొలగింపు డ్రైవ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన మహిళలు ఒక్క సారిగా ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కారంపొడి చల్లారు. దీంతో పలువురి మహిళలను వారు అదుపులోకి తీసుకున్నారు.

నల్లగా ఉన్నానని విమర్శలు చేయడంపై తమిళిసై సౌందర్‌రాజన్ ఆగ్రహం.. అగ్గిలా మారతానని హెచ్చరిక..

గత శుక్రవారం మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్ ప్రాంతంలో దాదాపు 1200 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం మెహ్రౌలీలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపడుతున్నారు. ఈ నిరసనలు మూడో రోజు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ నిరసనల మధ్యే ఆక్రమణల తొలగింపులు నిర్వహిస్తున్నారు. దీని కోసం డీడీఏ అధికారులు పోలీసుల సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మోహరించిన పోలీసులపై మహిళలు ఆగ్రహంతో కారంపొడి చల్లారు.

ఢిల్లీలోని కూలర్ ఫ్యాక్టరీలో ఘోరం.. లిఫ్ట్ లో ఇరుక్కొని 15 ఏళ్ల బాలుడు మృతి.. ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు

అయితే మెహ్రౌలీ లోని భూమిని స్వాధీనం చేసుకునేందుకు సంబంధిత భూమిలో అక్రమ నిర్మాణాల గోడలపై గతేడాది డిసెంబర్ 12వ తేదీన కూల్చివేత ఆర్డర్‌ను అతికించారు. మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్ ప్రాంతంలో ఉన్న అన్ని అనధికార నిర్మాణాలను 10 రోజుల్లోగా తొలగించాలని అందులో ఆదేశించారు.

Scroll to load tweet…

ఈ నోటీసుల ప్రకారం కూల్చివేత జరుగుతున్న భూమి మెహ్రౌలీ పురావస్తు పార్కులో భాగం. ప్రస్తుతం ఉన్న అనధికార ఆక్రమణలు మెహ్రౌలీ పురావస్తు ఉద్యానవనం అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. విశాలమైన ఈ పార్క్ చారిత్రక కట్టడాలతో నిండి ఉంది. ఈ ప్రాంతం మొత్తం డీడీఏ పరిధిలోకి వస్తుంది. అయితే వారసత్వ కట్టడాలను పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) విభాగం నిర్వహిస్తుంది.

భారత్, అమెరికా రక్షణ రంగ మైత్రికి చిహ్నమైన UAV Prototype సెప్టెంబర్, 2023 నాటికి టెస్టింగ్ దశకు చేరే అవకాశం..

కాగా.. మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌లో జీ20 సమావేశం నిర్వహించనున్నారు. దీని కోసం ఏఎస్ఐ పూర్తి స్వింగ్‌లో పని చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్చి ప్రారంభంలో నిర్వహించే ఈ జీ20 సమావేశానికి విదేశాల నుంచి చాలా మంది అతిథులు మన దేశానికి రానున్నారు. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.