ఢిల్లీలోని ఓ కూలర్ ఫ్యాక్టరీలో ఉన్న లిఫ్ట్ లో ఇరుక్కొని 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఢిల్లీలో ఘోరం జరిగింది. కూలర్ ఫ్యాక్టరీలోని లిఫ్ట్ లో ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. మృతి చెందిన బాలుడి వయస్సు 15 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని ఔటర్ నార్త్ జిల్లాలోని బవానా ప్రాంతంలో ఉండే కూలర్ ఫ్యాక్టరీలో ఇది చోటు చేసుకుంది. మృతుడిని అలోక్‌గా గుర్తించారు.

వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. లైకుల కోసం ఏకంగా శోభనం వీడియోనే సోషల్ మీడియాకు.. నెట్టిజన్లు ఏమంటున్నారంటే...

అలోక్ తల్లి ఆ ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. అయితే ఆదివారం ఆమె తన కుమారుడిని తీసుకొని ఫ్యాక్టరీకి వచ్చింది. తల్లి పని చేస్తున్న క్రమంలో బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్‌లోని షాఫ్ట్‌లోకి వెళ్లాడు. దీంతో అతడు వైర్లలో చిక్కుకున్నాడు. అదే సమయంలో ఎవరో గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ లోకి ఎక్కి రెండో ఫ్లోర్ లోకి వెళ్లేందుకు బటన్ నొక్కారు. దీంతో లిఫ్ట్ పైకి వెళ్లడంతో ఆ బాలుడు అందులో ఇరుక్కుపోయి, చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్‌ కాల్‌ ద్వారా డెలివరీ చేసిన వైద్యురాలు.. తల్లి బిడ్డ క్షేమం..

ఈ ప్రమాదానికి కారణమైన లిఫ్ట్ ప్రధానంగా భారీ వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. అయితే బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. నిందితులపై కార్మిక చట్టాల ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. 

ఆర్టికల్ 370 రద్దుపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు

కాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఢిల్లీలోని మాల్వీయా నగర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లిఫ్ట్‌కు, గోడకు మధ్య ఇరుక్కుని ఓ యువకుడు మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.