Asianet News TeluguAsianet News Telugu

రైలులో సీటు కోసం జుట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్...!

ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని రోడ్స్ ఆఫ్ ముంబయి అనే ఓ ట్విట్టర్ యూజర్... సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

Women Passengers Slap, Punch And Pull Each Other's Hair Inside Mumbai Local Train
Author
First Published Oct 18, 2022, 9:47 AM IST

బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని వాదులాడుకుంటారు. కానీ... మరీ దారుణంగా జుట్టుపట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం, దారుణంగా దూషించడం మాత్రం  చూసి ఉండరు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయి లోకల్ ట్రైన్ లో ముగ్గురు మహిళలు దారుణంగా గొడవపడ్డారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని రోడ్స్ ఆఫ్ ముంబయి అనే ఓ ట్విట్టర్ యూజర్... సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

వీడియో క్లిప్ లో  మహిళల కంపార్ట్‌మెంట్ లోపల మహిళలు దారుణంగా హింసకు పాల్పడినట్లు కొట్టుకున్నారు. ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం, జుట్లు పట్టుకొని లాగడం కనిపించింది. మరోవైపు ఇతర ప్రయాణికులు గొడవను పరిష్కరించేందుకు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. వదిలేయండి, గొడవ ఆపండి అని చెబుతున్నా.. వారు ఆపకపోవడం గమనార్హం.

 


ఈ క్లిప్‌ను మొదట ఆరు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షరీఫైజాన్ సయ్యద్ అనే యూజర్ షేర్ చేయడం గమనార్హం.కాగా, ట్విట్టర్‌లో వీడియో వైరల్‌గా మారింది. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో, ఇది 376,000 కంటే ఎక్కువ వ్యస్ 4,400 కంటే ఎక్కువ లైక్‌లు రావడం గమనార్హం. కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది.


ముంబై లోకల్ రైళ్లలో గొడవలు జరగడం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం, ఇలాంటి మరొక సంఘటనలో, ముంబై రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో సహ ప్రయాణీకుల మధ్య ఘోరమైన గొడవ జరిగింది. థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లో మహిళలు ఒకరితో ఒకరు ఘర్షణ పడగా..... అదికూడా వైరల్ గా మారింది. వివాదాన్ని పరిష్కరించేందుకు నెరుల్‌లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు మహిళపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో గాయపడ్డారు. మహిళ పోలీస్ తో సహా కనీసం ముగ్గురు మహిళలు గాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios