Asianet News TeluguAsianet News Telugu

దేశ వృద్ధి ప్ర‌యాణంలో మ‌హిళ‌లు చోదక శక్తిగా ఎదుగుతున్నారు : ప్ర‌ధాని మోడీ

New Delhi: ఎఫ్ డీఐలు ఏటేటా కొత్త‌ రికార్డులు బద్దలు కొడుతున్నాయ‌నీ, సేవలు, వస్తువులు రెండింటిలోనూ ఎగుమతి రికార్డులు బద్దలవుతున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. మేకిన్ ఇండియా అన్ని రంగాల్లో ఘన విజయం సాధించిందనీ, స్టార్టప్ లు, మొబైల్ తయారీలో అద్భుతాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన మునుపెన్నడూ లేనంత వేగంగా జరుగుతోంది, ఇవన్నీ మన యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు.
 

Women are emerging as a driving force in india's growth journey: PM Narendra Modi RMA
Author
First Published Sep 6, 2023, 4:44 PM IST

Prime Minister Narendra Modi: దేశాభివృద్ధికి మహిళలు చోదకశక్తిగా ఎదుగుతున్నారని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మనీకంట్రోల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహిళలు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అంతరిక్షం నుంచి క్రీడలు, స్టార్టప్ ల నుంచి స్వయం సహాయక సంఘాల వరకు ప్రతి రంగంలోనూ మహిళలు ముందంజలో ఉన్నారన్నారు. జీ-20తో ఇప్పుడు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్ర‌శంసించ‌బ‌డుతున్న‌ద‌ని అన్నారు. "ఇది భారతీయ మహిళల శక్తి. పేదలు, యువత, మహిళలు, రైతుల సాధికారతతో భారత్ భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని" మోడీ అన్నారు.

భారత్ ఎదుగుదల భారతీయులకే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదన్నారు. 'భారత వృద్ధి స్వచ్ఛమైన, పచ్చని వృద్ధి. మానవ కేంద్రీకృత విధానంతో భారతదేశ వృద్ధిని సాధిస్తున్నాం. దీనిని ఇతర దేశాలలో కూడా అనుకరించవచ్చు. భారతదేశ వృద్ధి గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను మరింత పెంచడానికి సహాయపడుతుందని" ప్ర‌ధాని అన్నారు. భారతదేశ వృద్ధి ప్రపంచ సరఫరా గొలుసుకు విశ్వసనీయత, స్థితిస్థాపకతను తీసుకురావడానికి సహాయపడుతుందనీ, ప్ర‌పంచ శ్రేయస్సు కోసమే భారత్ అభివృద్ధి అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

అలాగే, ఎఫ్ డీఐలు ఏటేటా కొత్త‌ రికార్డులు బద్దలు కొడుతున్నాయ‌నీ, సేవలు, వస్తువులు రెండింటిలోనూ ఎగుమతి రికార్డులు బద్దలవుతున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. మేకిన్ ఇండియా అన్ని రంగాల్లో ఘన విజయం సాధించిందనీ, స్టార్టప్ లు, మొబైల్ తయారీలో అద్భుతాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన మునుపెన్నడూ లేనంత వేగంగా జరుగుతోంది, ఇవన్నీ మన యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు.

'వృద్ధి ప్రయోజనాలను చివరి మైలు వరకు తీసుకెళ్తున్నాం. పేదరికంపై పోరాటంలో ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తుండగా, సమగ్ర సామాజిక భద్రత వలయం మన పేదలను రక్షిస్తుంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మందికి పైగా ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడటంతో ఆశావహ నయా మధ్యతరగతి రూపుదిద్దుకుంటోంది. సమాజంలోని ఈ వర్గం వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని' మోడీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios