ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. టూవీలర్ మీద వెళ్తున్న భార్యాభర్తలను ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఆ తర్వాత భర్త కళ్లెదుటే భార్యపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానకి పాల్పడ్డారు. ఆగ్రా జిల్లా ఎత్మద్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఆ దారుణ సంఘటన చోటు చేసుకుంది. 

ఆ సంఘటనపై బాధితురాలు మంగళవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మహిళ తన భర్తతో కలిసి అత్మదుల్లా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు వారిని మార్గమధ్యలో అడ్డగించారు. వారిపై దాడి చేసి అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. 

ఆ తర్వాత భర్త చూస్తుండగానే భార్యపై ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు ఈ దృశ్యాలను వీడియో తీశారు. బాధితుల నుంచి రూ. 10 వేల నగదు, చెవిపోగులు, ఇతర వస్తువులు లాక్కుని వెళ్లారు. 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.