Asianet News TeluguAsianet News Telugu

దళిత యువకుడితో ప్రేమ పెళ్లి.. నచ్చని యువతి తల్లిదండ్రులు ఏం చేశారంటే..!

ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో ఆమెను అత్తవారింటి నుంచి పుట్టింటికి రప్పించి, చదువుకునేందుకు తిరిగి రాజ్‌గఢ్‌లోని హాస్టల్‌కు పంపించారు. అయితే ఆమె అక్టోబరు 28న హాస్టల్ నుంచి పారిపోయి బైతూల్‌లో ఉంటున్న భర్త దగ్గరకు చేరుకుంది. 
 

Woman Complaint against Parents Over love Affair in Madhyapradesh
Author
Hyderabad, First Published Oct 30, 2021, 10:45 AM IST

ఓ నర్సింగ్ విద్యార్థిని.. దళిత యువకుడిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంది. అయితే.. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురిపై కక్ష పెంచుకున్నారు. పోలీసుల సహాయంతో.. అత్తారింట్లో ఉన్న కూతురిని ఇంటికి రప్పించారు. ఆ తర్వాత.. ఆమె నర్మదా నదిలో స్నానం చేయించి.. జుట్టు కత్తిరించి.. దుస్తులు పారేసి.. ఆ తర్వాత.. తమ కుమార్తె మళ్లీ పవిత్రమయ్యిందంటూ.. తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మరో వ్యక్తితో వివాహం జరిపించాలని ప్రయత్నం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన  మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also read: అన్నదాత స్వయంగా పంటకు నిప్పు.. ఈ దుస్థితికి దేశం సిగ్గుపడాలి.. మద్దతు ధరకు బీజేపీ ఎంపీ డిమాండ్

మహిళా సెల్ డీఎస్పీ పల్లవి గౌర్ మాట్లాడుతూ బాధితురాలు యాదవ కులానికి చెందినదని అన్నారు. ఆ 24 ఏళ్ల యువతి.. బైతూల్‌లోని టికారీ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మార్చి 11న ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో ఆమెను అత్తవారింటి నుంచి పుట్టింటికి రప్పించి, చదువుకునేందుకు తిరిగి రాజ్‌గఢ్‌లోని హాస్టల్‌కు పంపించారు. అయితే ఆమె అక్టోబరు 28న హాస్టల్ నుంచి పారిపోయి బైతూల్‌లో ఉంటున్న భర్త దగ్గరకు చేరుకుంది. 

Also Read: నమాజ్ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 30 మంది అరెస్టు

కాగా ఆ యవతి తండ్రి ఆగస్టు 18న పెద్దలందరి సమక్షంలో బలవంతంగా ఆమె చేత నర్మదా నదిలో స్నానం చేయించి శుద్ధీకరణ చేయించాడు. ఆమె జుట్టు కత్తిరించి, ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులను అక్కడే పారవేయించాడు. ఈ ప్రక్రియ ద్వారా తన కుమార్తెకు తిరిగి తమకు నచ్చిన మరో వ్యక్తితో వివాహం చేయించవచ్చని తండ్రి భావించాడు. పోలీసులను ఆశ్రయించిన ఆ యువతి తన తండ్రి తమను పరువు హత్యకు బలిచేస్తాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. 

Also Read This : బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

పెళ్లయిన తరువాత నుంచి పుట్టింటివారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తాను అదృశ్యమయ్యానంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ఆమె తెలిపింది. దీంతో ముగ్గురు పోలీసులు తనను బలవంతంగా అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చారని పేర్కొంది. మైనారిటీ తీరిన తాను తన ఇష్టప్రకారం వివాహం చేసుకున్నానని, తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios