బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

Nawab Malik says Drugs case a part of conspiracy by BJP to move Bollywood out of Mumbai

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఆధికారిగా ఉన్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) సంచనల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం అలా కొనసాగుతుండగానే నవాబ్ మాలిక్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినీ ప్రముఖులతో సమావేశమైన విషయాన్ని మాలిక్ ప్రస్తావించారు.

Also read: Aryan Khan : తండ్రి షారూఖ్ ను తలపించే.. ఆర్యన్ స్టైలిష్ లుక్...

‘ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు.. బాలీవుడ్‌ను మహారాష్ట్ర నుండి తరలించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది బాలీవుడ్ పరువు తీసేందుకు బీజేపీ చేసిన కుట్ర’ అని నవాబ్ మాలిక్ మీడియా సమావేశంలో అన్నారు.  భయం కారణంగానే అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ Sameer Wankhede బాంబే హైకోర్టును ఆశ్రయించాడని చెప్పారు. 

‘పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి ఈడ్చుకెళ్లిన వ్యక్తి (కిరణ్ గోసావి) ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్‌తో పాటుగా ఇతరులకు బెయిల్ రాకుండా చూస్తున్న వ్యక్తి  నిన్న కోర్టు తలుపులు తట్టాడు. రక్షణ కల్పించాలని కోరుతూ గత వారం ముంబై పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అతను నిజంగా ఏదో తప్పు చేసి ఉంటాడు.. అందుకే అతనిపై చర్యలు తీసుకుంటారమోనని భయపడుతున్నాడు’ అని Nawab Malik పేర్కొన్నారు. 

Also read: ఆర్యన్ ఖాన్ కు బెయిల్.. శనివారం వరకు జైల్ లోనే...

ఇది వ్యక్తిగత పోరాటం కాదని నవాబ్ మాలిక్ అన్నారు. తాను చేసిన ఆరోపణలు అన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. సమీర్ వాంఖడే తన గొంతును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ఇదిలా ఉంటే సమీర్ వాంఖడే‌కు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయబోమని ముంబై పోలీసులు హైకోర్ట్‌కు తెలిపారు. గత కొద్ది రోజులుగా వాంఖడే అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించారని నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు. 

Also read; సీఎం అవ్వడం కోసం రాలేదు.. కేంద్రం దాదాగిరిని అనుమతించం.. గోవాలో మమతా బెనర్జీ

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుకు సంబంధిచి Aryan Khanకు మరో ఇద్దరు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక, డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని 2018 చీటింగ్ కేసుకు సంబంధించి పుణె పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అక్టోబర్ 3న గోవాకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్‌తో గోసావి తీసుకున్న సెల్ఫీ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios