Asianet News TeluguAsianet News Telugu

అన్నదాత స్వయంగా పంటకు నిప్పు.. ఈ దుస్థితికి దేశం సిగ్గుపడాలి.. మద్దతు ధరకు బీజేపీ ఎంపీ డిమాండ్

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు తాము కష్టపడి పండించిన పంటకే నిప్పు పెట్టే పరిస్థితి నెట్టివేయబడ్డారని, ఇది దేశానికే సిగ్గుచేటని అన్నారు. ఆయన ఇటీవలే తన నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి రైతుల పంట కొనుగోళ్లలో అక్రమాలు జరిగితే తాను ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

bjp mp varun gandhi slams govt demands legal guarantee for MSP
Author
Lucknow, First Published Oct 29, 2021, 6:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి రైతు సమస్యపై గళం విప్పారు. పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఉంటేనే వారిపై దోపిడీ సాగదని MP Varun Gandhi అన్నారు. అంతకాలం వ్యవసాయ మార్కెట్‌లలో Farmersను దోచుకుంటూనే ఉంటారని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్‌లోని అధికారులకు, మధ్యదళారులకు ఉన్న చీకటి ఒప్పందాలు దేశమంతటికీ తెలుసేనని అన్నారు. అన్నదాతలు స్వయంగా పండించిన పంటకు నిప్పు పెట్టే దుస్థితికి చేరుకున్నారని, దీనికి Uttar Pradesh ప్రభుత్వం సహా దేశమంతా సిగ్గుపడాలని ఆగ్రహించారు. రైతులు ఇప్పటికే చితికిపోయి ఉన్నారని, వారిని దోచుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ఉద్యమాలపై, లఖింపూర్ ఖేరి ఘటనపై అన్నదాతల పక్షాన నిలిచిన BJP ఎంపీ వరుణ్ గాంధీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. మేనకా గాంధీ, వరుణ్ గాంధీలను బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నుంచి తొలగించారు. అయినప్పటికీ వరుణ్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిబిత్ నియోజకవర్గంలో రైతులపై దోపిడీని సహించబోరని, ప్రతి వ్యవసాయ మార్కెట్‌లో తన ప్రతినిధి ఒకరు ఉంటారని అవినీతి అధికారులను హెచ్చరించారు. వారు ప్రతి Procurementను రికార్డు చేస్తారని స్పష్టం చేశారు. అక్రమాలు, Corruption జరిగితే తాను ఊరుకోబోరని అన్నారు. ఆ అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోరని తెలిపారు. నేరుగా కోర్టుకు వెళ్తారని, అవినీతిపరులను జైలుకు పంపిస్తారని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ

వరుణ్ గాంధీ ఓ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడి అధికారులతో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంట కొనుగోలులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నాయని అన్నారు. అధికారులు అతి తెలివితో రైతులు కష్టపడి పండించి తెచ్చిన పంటను బలవంతంగా తిరస్కరిస్తుంటారని చెప్పారు. ధాన్యం నల్లబడిందని, లేదంటే తేమ ఎక్కువగా ఉన్నదని, లేదా.. మరేవేవో కారణాలు చెప్పి ధాన్యాన్ని వెనక్కి పంపుతుంటారని అన్నారు. ఇలా రైతులను హింసిస్తుంటారని తెలిపారు. దిక్కుతోచని పరిస్థితుల్లో వారు మార్కెట్ సమీపంలోనే ఉండే మధ్యదళారులకు పంటను అమ్ముకుంటారని వివరించారు. ఆ దళారులు మళ్లీ వ్యవసాయ మార్కెట్ అధికారులతో కుమ్మక్కై పంటను అక్కడికే పంపిస్తారని అన్నారు.

దేశంలో రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అందరికీ తెలిసిందేనని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. అలాంటి దుస్థితిలో ఉన్న అన్నదాతలను కాల్చుకు తినడం ఎంతటి దారుణమని ఆవేదన చెందారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు స్వయంగా నిప్పు పెడుతున్నారంటే అర్థం చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహాయ యావత్ దేశం సిగ్గుపడాలని తెలిపారు. పంటను అమ్మలేకపోయిన ఓ రైతు తన పంటకు తానే నిప్పుపెడుతున్న ఓ వీడియోను వరుణ్ గాంధీ ఇటీవలే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read: Lakhmipur Kheri: హత్య చేసి ఆందోళనకారుల నోరు మూయలేరు.. మరో వీడియో ట్వీట్ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ

నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న లఖింపూర్ ఖేరి ఘటనపై వరుణ్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios