కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం బజరంగ్ బలి నినాదాలతో మారుమోగిపోయింది.హనుమంతుడు తమ వైపే ఉన్నాడని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హనుమాన్ వేషధారణలో బీజేపీ, మితవాద పార్టీపై విరుచుకుపడ్డారు. అలాగే బజరంగ్ బలి నినాదాలు చేశారు.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. సీఎం ఉండగానే గందరగోళ పరిస్థితి.. (వీడియో)
‘బజరంగ్ బలి బీజేపీ కే నహీ కాంగ్రెస్ కే సాత్ హై... భజరంగ్ బలి నే బీజేపీ పర్ ఫైన్ లగాయా హై (భజరంగ్ బలి కాంగ్రెస్ తో ఉన్నారు. బీజేపీకి జరిమానా విధించారు’ అని హనుమాన్ వేషధారణలో తిరుగుతున్న ఓ కార్యకర్త పేర్కొన్నారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. కులం, మతం ఆధారంగా వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేసే బజరంగ్ దళ్ వంటి మితవాద గ్రూపులను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించింది. తరచూ నిఘా, హింస, మోరల్ పోలీసింగ్ తో ముడిపడి ఉన్న బజరంగ్ దళ్ ను నిషేధిత ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోల్చింది.
Karnataka Election Results: హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పూజలు..
‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని, బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి వ్యక్తులు, సంస్థలు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషాలను ప్రోత్సహించే సంస్థలపై నిషేధం విధించడంతో పాటు చట్టప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాం’ అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.
అయితే పీఎఫ్ఐతో బజరంగ్ దళ్ ను పోల్చడంపై బీజేపీ విమర్శలు చేసింది. పలు వర్గాల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం కావడంతో కాంగ్రెస్ కొంత వెనక్కి తగ్గింది. బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన ఏదీ లేదని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను నమ్మదు.. మేము సొంతంగా అధికారంలోకి వస్తాం - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కానీ ఈ వివాదాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చుకుంది. హనుమంతుడిని కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆరోపించారు. బజరంగ్ బలి భక్తులను బంధించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని, ‘జై బజరంగ్ బలి’ అని నినదించాలని, సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని శిక్షించాలని ప్రధాని మోడీ ఓటర్లను కోరారు.
