కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఆలయం సిమ్లాలోని జాఖులో ఉంది.
కర్ణాటకలో ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సిమ్లాలోని ఓ ఆలయానికి వెళ్లారు. సిమ్లాలోని జాఖులోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశం, కర్ణాటక రాష్ట్రం శాంతి, శ్రేయస్సు కోసం ప్రియాంక గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేశారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్టు ‘ఎన్డీటీవీ’ నివేదించింది.
కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను నమ్మదు.. మేము సొంతంగా అధికారంలోకి వస్తాం - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటకలో కౌంటింగ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్.. కేవలం గంట వ్యవధిలోనే సగం మార్కును దాటింది. అధికార బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) లను దాటి ఆ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కాగా.. 224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 130కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. ఓల్డ్ మైసూర్, ముంబై కర్ణాటకలలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగిస్తుంది. బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలలో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరుస్తుంది.
ఇదిలా ఉంటే.. . కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని యతీంద్ర ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల తమకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే చాన్స్ ఉండకపోవచ్చని అన్నారు. ఒకవేళ తమకు మెజారిటీ రాని పక్షంలో ఏం చేయాలనే దానిపై ఢిల్లీలోని పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.
ఇద్దరు డాక్టర్లతో సహా ఐదుగురి మీద వీధికుక్క దాడి...అక్కడికక్కడే మృతి..
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మొత్తం స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకే దశలో మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే దీని కోసం అధికారులు కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు. మరి కొన్ని గంటల్లో కర్ణాటక పీఠం ఎవరిదో తేలిపోనుంది.
