కర్ణాటకలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను నమ్మదని చెప్పారు. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని తెలిపారు. 

కర్ణాటక అసెంబ్లీ పీఠంపై జెండా ఎవరు ఎగరువేయబోతున్నారో మరి కొన్ని గంటల్లో స్పష్టం కానుంది. నేటి మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మ్యాజిక్ నెంబర్ దాటుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఆ విషయం అధిష్టానం నిర్ణయిస్తుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా నాన్న సీఎం కావాలి: యతీంద్ర సిద్దరామయ్య

ఈ మేరకు శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు అన్ని బూత్, నియోజకవర్గాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. తాము మెజారిటీ దాటి అధికారం చేపడుతామని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ రిసార్టులు బుక్ చేసుకుందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆ పార్టీకి మెజారిటీ రాదని అన్నారు. అందుకే ఆ పార్టీ ఇతర పార్టీలతో టచ్ లో ఉందని ఆరోపించారు.

‘నాకు డిమాండ్ లేదు.. నాది చిన్న పార్టీ’- కౌంటింగ్ కు ముందు జేడీఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పొత్తు ప్రసక్తే లేదని, తమకు పూర్తి మెజారిటీ రావడం ఖాయమని అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలు ఏ సమావేశం అయినా నిర్వహించనివ్వండి. ఎందుకంటే వారికి నిర్వహించే హక్కు ఉంది’’ అని సీఎం అన్నారు.

దోమ కుట్టి చనిపోయాడు.. యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే?

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావలంటే మెజారిటీ మార్కు 113 స్థానాలు ఫొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రండ్ ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ 110 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. బీజేపీ 78, జేడీఎస్ 5 స్థానాల్లో లీడ్ లో ఉంది.