కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సరళిని గమనిస్తున్న నాయకులున్న బీజేపీ ఆఫీసులోకి పాము చొరబడింది. దీంతో ఆ ఆఫీసు ప్రాంగణంలో ఒక్క సారిగా అలజడి రేగింది. ఆ సమయంలో అక్కడ సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఉన్నారు. ఆ పామును సిబ్బంది రక్షించారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్న షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వింత ఘటన చోటు చేసుకుంది. షిగ్గావ్లోని బీజేపీ క్యాంపు కార్యాలయ ఆవరణలోకి పాము ప్రవేశించింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఆఫీసులో ఉన్న ప్రజల్లో ఒక్క సారిగా పాము అలజడి దీంతో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
Karnataka Election Results: హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పూజలు..
ఈ విషయం ఆఫీసులో ఉన్న సిబ్బందికి తెలియడంతో వారు ఆ పామును రక్షించారు. సీఎం ఉన్న భవన ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచారు. కాగా.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ స్థానాన్ని కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే ఈ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి సీఎం బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనకు ఇక్కడ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
కాగా.. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ట్రెండ్ కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తోంది. బీజేపీ వెనుకబడింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా బీజేపీ మూడో స్థానంలో నిలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.
కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను నమ్మదు.. మేము సొంతంగా అధికారంలోకి వస్తాం - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మొత్తం స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకే దశలో మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే దీని కోసం అధికారులు కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు. మరి కొన్ని గంటల్లో కర్ణాటక పీఠం ఎవరిదో తేలిపోనుంది. కాగా.. కర్ణాటకలో 2018లో నమోదైన 72.36 శాతం పోలింగ్ ను అధిగమించి ఈ సారి అత్యధికంగా 73.19 శాతం పోలింగ్ నమోదైంది.
