Asianet News TeluguAsianet News Telugu

ఐసొలేషన్ లో ఉండకుండా తప్పించుకున్న కరోనా సోకిన టెక్కీ భార్య అరెస్టు

కరోనా సోకినా టెక్కీ క్వారంటైన్ లో ఉండగా...  అతని భార్య మాత్రం క్వారంటైన్ లో ఉండకుండా తప్పించుకున్నందుకు ఆమెపై కేసు నమోదు చేసారు ఆగ్రా పోలీసులు. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను బలవంతంగా ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 

Wife of Bengaluru google techie booked by Agra police for fleeing quarantine
Author
Agra, First Published Mar 15, 2020, 12:35 PM IST

కరోనా దెబ్బకు ప్రపంచం వణికి పోతుంది. భారత దేశంలో కూడా కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ఆరంభించింది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. 

ఇక కరోనా వైరస్ అనుమానితులు ఎవ్వరైనా సరే వారి పరీక్షల్లో నెగటివ్ అని తేలేంతవరకు క్వారంటైన్ చేయాల్సిందేనన్నా విషయంతెలిసిందే. కరోనా సోకిన వారయితే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా నయమయ్యే వరకు బయటకు వెళ్లొద్దన్న నియమం తెలిసిందే. అందుకోసం వారిని ప్రత్యేకమైన ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. 

ఇక తాజాగా బెంగళూరులోని ఒక టెక్కీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గూగుల్ కంపెనీ ఉద్యోగి తన భార్యతో కలిసి హనీ మూన్ కోసం యూరప్ వెళ్లి వచ్చిన తరువాత అతనికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అతడిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 

Also read: కరోనావైరస్: గో మూత్రం విందు, భలే పసందు

కరోనా సోకిన టెక్కీ క్వారంటైన్ లో ఉండగా...  అతని భార్య మాత్రం క్వారంటైన్ లో ఉండకుండా తప్పించుకున్నందుకు ఆమెపై కేసు నమోదు చేసారు ఆగ్రా పోలీసులు. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను బలవంతంగా ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 

టెక్కీ చెబుతున్న ప్రకారం భార్య తాను ఇద్దరమూ ఒకే రోజు ఇండియాలో ల్యాండ్ అయ్యామని అన్నాడు. అక్కడి నుండి ఆమె అగ్ర చేరుకుంది. విమానం, రైల్లో ప్రయాణించి ఇంటికి చేరుకుంది. 

ఇలా కరోనా ఐసొలేషన్ వార్డునుంచి తప్పించుకోవడంతో ఆమెపై కేసు నమోదు చేసి బలవంతంగా ఇసోలాటిన్ వార్డుకు తరలించారు. ఆమె కు, ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా కుటుంబ సబ్యులకు నెగటివ్ గా వచ్చింది. ఇప్పుడు మరోమారు ఆమె శాంపిళ్లను కరోనా పరీక్షకు పంపారు. 

టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమె కు రెండోసారి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆమె ఆమె కుటుంబ సభ్యులందరు ఇసోలాటిన్ వార్డులోనే ఉన్నారు. 

ఇక కరోనా వైరస్ పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమై కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనావైరస్ నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లను కూడా మూసేయాలని నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. 

షాపింగ్ మాల్స్ ను కూడా మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. శాసనసభ సమావేశాలను కూడా కుదించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి, నిరవధిక వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు నాలుగు ఉన్నాయి. వాటిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: భయంకరమైన కరోనావైరస్ కాంగ్రెసు: అసెంబ్లీలో పిట్టకథ చెప్పిన కేసీఆర్

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఓ వ్యక్తి కరోనా వైరస్ కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యాడు. ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు తేలిందని కేసీఆర్ శనివారం శాసనసభలో ప్రకటించారు. మరో ఇద్దరు అనుమానిత కరోనావైరస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆయన చెప్పారు. 

కాగా, వికారాబాదు జిల్లాలోని అనంతగిరిలో కరోనా వైరస్ కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను నేరుగా అనంతగిరికి తరలించి పరీక్షలు నిర్వహిస్తారు. డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధులు ఆ ప్రత్యేక ఏర్పాటును పరిశీలించారు.

Also read: తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా, ఇద్దరు అనుమానితులు: కేసీఆర్

మంత్రివర్గ సమావేశం తర్వాత అన్ని విషయాలను నిర్దిష్టంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే, రేపటి నుంచి మాల్స్, బడులు, థియేటర్లు బంద్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios