Asianet News TeluguAsianet News Telugu

వేగంగా పెరుగుతున్న టీబీ.. కరోనా రెండో వేవ్ తర్వాత మరింత తీవ్రం.. డబ్యూహెచ్ఓ నివేదిక లో ఎన్నో షాకింగ్ విషయాలు..

కరోనా మహమ్మారి వ్యాప్తి అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తల్లెత్తున్నాయి. మరి ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో ఆరోగ్య సమస్యలు క్రమంగా పెరుగుతోంది. తాజాగా.. కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గడంతో క్షయవ్యాధి( టీబీ) బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోన్నట్టు తెలుస్తోంది.

WHO report says Tuberculosis deaths and disease increase during the COVID-19 pandemic
Author
First Published Oct 28, 2022, 11:27 PM IST

గత రెండున్నరేండ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజవణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తల్లెత్తున్నాయి. మరి ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో ఆరోగ్య సమస్యలు క్రమంగా పెరుగుతోంది. తాజాగా.. కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గడంతో క్షయవ్యాధి( టీబీ) బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోన్నట్టు తెలుస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 గ్లోబల్ టిబి నివేదిక ప్రకారం..2021లో ప్రపంచవ్యాప్తంగా 10.6 మిలియన్ల మందికి క్షయవ్యాధి (టిబి) ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2020తో పోల్చితే.. కేసుల సంఖ్యలో  4.5% పెరుగుదల నమోదైంది. మొత్తం టీబీ రోగుల సంఖ్యలో మూడింట రెండు వంతుల (లేదా 68.3%) కంటే ఎక్కువ మంది కేవలం ఎనిమిది దేశాల్లో ఉన్నాయనీ,  ఆ దేశాల్లో భారత్ కూడా ఉందని నివేదిక తెలిపింది. అలాగే.. 1.6 మిలియన్ల మంది టీబీతో మరణించగా.. ఇందులో 1,87,000 మంది రోగులు హెచ్ఐవీ బారిన పడిన వారనీ, HIV పాజిటివ్ మరణాల్లో దాదాపు 82% మరణాలు ఆఫ్రికన్,ఆగ్నేయాసియా ప్రాంతాలలో సంభవించాయని, భారత్ లో 36 శాతం మరణాలు భారతదేశంలోనే సంభవించినట్లు నివేదిక పేర్కొంది.

ఈ నివేదక ప్రకారం.. 2021లో భారతదేశంలో మొత్తం 21.4 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. 2020లో నమోదైన టీబీ కేసులతో పోలిస్తే కేసుల సంఖ్యలో 18 శాతం పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా 22 కోట్ల మందికి పైగా ప్రజలు  ఈ వ్యాధికి పరీక్షలు చేయించుకున్నారు. ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం చేపట్టిన చొరవలో భాగంగా దేశవ్యాప్తంగా 10.45 లక్షల మందికి పైగా టిబి రోగుల్లో40,000 మందికి పైగా నిక్షయ్ మిత్రలు సహాయం చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 27న నివేదికను విడుదల చేసింది . ప్రపంచవ్యాప్తంగా TB నిర్ధారణ, చికిత్స, వ్యాధిపై COVID-19 మహమ్మారి ప్రభావాన్ని కనుగొంది.

ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొంది. 2021లో నమోదైన టీబీ కేసులను 2015 బేస్‌లైన్ సంవత్సరంతో పోలిస్తే.. 1,00,000 జనాభాలో 210 మందిలో టీబీ ఉన్నట్టు గుర్తించింది. ఇది ప్రపంచ సగటు 11 శాతం ఉండగా.. భారత్ లో కేవలం 7 శాతం మాత్రమే నమోదు అయ్యాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గణాంకాలు కూడా వ్యాధి రేటు పరంగా భారతదేశం 36వ స్థానంలో నిలిచిందని తెలిపింది. 

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా టీబీ ప్రోగ్రామ్‌లను ప్రభావితం చేసింది. 2020, 2021లో మన దేశంలో టీబీ నివారణకు ముఖ్యమైన చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించగలిగింది. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో 21.4 లక్షల టీబీ కేసులను గుర్తించగా.. గతంలో కంటే.. 18 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అన్ని విషయాలను ప్రభుత్వానికి నివేదించడానికి తప్పనిసరి నోటిఫికేషన్ విధానం వంటి ప్రోగ్రామ్‌లో సంవత్సరాలుగా అమలు చేయబడిన చర్యలు విజయానికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

యాక్టివ్‌గా ఉన్న రోగులను ఎవరూ వదిలిపెట్టకుండా చూసేందుకు ఇంటింటికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సమాజంలో వ్యాధి వ్యాప్తిని నివారించడానికి వీలైనన్ని ఎక్కువ కేసులను గుర్తించడం దీని లక్ష్యం, దీని వల్ల కేసుల తగ్గుదలకు దారితీస్తుంది. కేసులను కనుగొనే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి భారతదేశం కూడా రోగనిర్ధారణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ పరిధిని విస్తరించడంలో సహాయపడింది. భారతదేశం దేశవ్యాప్తంగా 4,760 కంటే ఎక్కువ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ మెషీన్‌లను కలిగి ఉందని, ప్రతి జిల్లాకు చేరుతుందని ప్రకటన తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios