Asianet News TeluguAsianet News Telugu

Bharat Biotech: తెలంగాణలోని కోవాగ్జిన్ ఉత్పతి యూనిట్ జీఎంపీ టెస్టులో విఫలం: ప్రపంచ ఆరోగ్య సంస్థ

హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కేంద్రం వద్ద మంచి తయారీ విధానాలను (GMP) పాటించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.

WHO On Covaxin suspension bharat biotech production site is not compliance with GMP
Author
Hyderabad, First Published Apr 5, 2022, 10:07 AM IST

తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్‌కు  ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చింది. భారత్‌ బయోటెక్ సంస్థ కోవిడ్ నియంత్రణ కోసం కోవాగ్జిన్‌ను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కేంద్రం వద్ద మంచి తయారీ విధానాలను (GMP) పాటించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ఆ టీకా ప్రొక్యూర్మెంట్‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి నిలిపేయాల‌ని ఇటీవ‌ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

మార్చి 14 నుంచి 22 మధ్య నిర్వహించిన తనిఖీలో తెలంగాణలోని కోవాగ్జిన్ ఉత్పత్తికి సంబంధించి తయారీ స్థలం జీఎంపీకి(good manufacturing practices) అనుగుణంగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ‘తయారీ ప్రక్రియలోని కొన్ని భాగాలలో సమస్యలు గుర్తించబడ్డాయి. అంతేకాకుండా EUL (అత్యవసర వినియోగ జాబితా) మంజూరు చేయబడిన తర్వాత మార్పులు చేయబడ్డాయి. అయితే వాటిని evaluation, ధృవీకరణ కోసం..  జాతీయ డ్రగ్ రెగ్యులేటర్‌కు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించబడలేదు. భారత్‌లోని వివిధ తయారీ సైట్లలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది’ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇక, భారత్ బయోటెక్ సంస్థ.. హైదరాబాద్, కర్ణాటకలోని మలూరు,  గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఇక, GMP లోపాలను పేర్కొంటూ కోవాక్సిన్ సరఫరాను నిలిపివేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 2వ తేదీన ఒక ప్రకటనను విడుదల చేసింది. కానీ ఇందుకు సంబంధించిన తదుపరి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండే గతేడాది నవంబర్ 3వ తేదీన కోవాగ్జిన్‌ను డబ్ల్యూహెచ్‌వో.. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. 

తనిఖీ ఫలితాల గురించి భారత్ బయోటెక్‌కు తెలియజేసినట్టుగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ‘కోవాగ్జిన్ సురక్షితంగా ఉందనే నిర్దారణతో.. ఇప్పటికే పంపిణీ చేయబడిన డోసులకు ప్రాథమిక ప్రమాద-ప్రయోజన అంచనాను నిర్వహించాం. ప్రయోజనం/ప్రమాద అంచనా ఇప్పటికీ అనుకూలంగానే ఉంది’’ అని కంపెనీ తెలిపిందని WHO పేర్కొంది. ఇక, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేవని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. రిస్క్ అసెస్‌మెంట్ రిస్క్-బెనిఫిట్‌లో మార్పును సూచించలేదని తెలిపింది. అందుబాటులో ఉన్న డేటా.. వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉందని, ఎటువంటి భద్రతా సమస్యలు గుర్తించబడలేదని పేర్కొంది. 

‘‘అయితే.. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వ్యాక్సిన్‌లను ఉపయోగించవద్దని.. తగిన చర్యలను అనుసరించవద్దని WHO దేశాలను సిఫార్సు చేస్తుంది. గుర్తించిన లోపాలను పరిష్కరించే ప్రక్రియ, సౌకర్యాల నవీకరణలను నిర్వహించడానికి ఉత్పత్తిని నిలిపివేయడం వలన కోవాక్సిన్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ మూలాల నుండి వ్యాక్సిన్‌లతో దేశాలు టీకాను కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కోవాక్స్ పేరుతో ఐకరాజ్య సమితి..  WHO, GAVI, కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (CEPI) వంటి ఇతర భాగస్వాములతో కలిసి అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమిని ఏర్పాటు చేసింది. అయితే డబ్ల్యూహెచ్‌వో సస్పెన్షన్ ఆర్డర్‌కు ఒక్క రోజు ముందు.. కోవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. సరఫరా బాధ్యతలను పూర్తి చేయడంతో.. డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నందున తాత్కాలికంగా కోవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్టుగా పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది.

COVID-19 ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి గత ఏడాది కాలంగా కోవాగ్జిన్ టీకాను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసినట్టుగా భారత్ బయోటెక్‌ సంస్థ తెలిపింది. ఇందుకోసం తమ తయారీ కేంద్రాలన్నీ నిరంతరం పనిచేశాయని పేర్కొంది. వ్యాక్సిన్ తయారీ కేంద్రాల అధునాతన ప్రక్రియ చేపట్టాల్సిన ఉందని తెలిపింది. తయారీ కేంద్రాల్లో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, సదుపాయాలను మరింత సమర్థవంతంగా వినియోగించే ప్రక్రియపై దృష్టి సారించినట్లు చెప్పింది. కోవాగ్జిన్ టీకా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని భారత్ బయోటెక్ ప్రకటనలో స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios