క్యాన్సర్ తో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత..
Sushil Modi : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో తుదిశ్వాస విడిచారు.
Sushil Kumar Modi : బీజేపీ సీనియర్ నాయకులు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. సుశీల్ మోదీ క్యాన్సర్‌తో పోరాడుతూ గత నెల రోజులుగా ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే సుశీల్ కుమార్ మోడీ ఈ వ్యాధి గురించి మీడియాలో వెల్లడించారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సుశీల్ కుమార్ మోడీ మరణ వార్తను అందించారు.
సుశీల్ కుమార్ మోడీ సమకాలీన రాజకీయాల్లో బీహార్‌లోని అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. సామ్రాట్ చౌదరి ఎక్స్‌లో పోస్టులో.. ''బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ జీ మృతికి హృదయపూర్వక నివాళి. బీహార్ బీజేపీకి ఇది కోలుకోలేని నష్టం. ఒక రోజు ముందు ఆదివారం పాట్నాలో ప్రధాని మోడీ రోడ్‌షో చేశారు. ఈ రోడ్‌షోలో ప్రధాని మోడీ ఉన్నారు కానీ అందరూ సుశీల్ మోడీని మిస్సయ్యారు. ఆయనే మోడీ, సుశీల్ కుమార్ మోదీ. సుశీల్ కుమార్ మోడీ అనేక దశాబ్దాలుగా బీహార్ బీజేపీకి గుర్తింపుగా కొనసాగారని'' పేర్కొన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా హైకమాండ్ రాజ్యసభకు పంపింది. ఈ ఏడాది ప్రారంభంలో సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఇద్దరు మృతి
బీహార్ రాజకీయాలపై సుశీల్ కుమార్ మోడీకి ఉన్నంత అవగాహన బీహార్ బీజేపీకి చెందిన ఏ నాయకుడికి లేదని బీహార్ రాజకీయ వర్గాల్లో భావిస్తున్నారు. సుశీల్ కుమార్ మోడీకి బీహార్ బీజేపీపై బ్లాక్ స్థాయి వరకు అవగాహన ఉంది. ఆయన మృతితో బీహార్ బీజేపీకే కాకుండా పార్టీ హైకమాండ్‌కు కూడా జరిగిన నష్టం పూడ్చలేనిది. సుశీల్ కుమార్ మోడీ 2005 నుండి 2013 వరకు బీహార్‌కు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. జీఎస్టీ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులో సుశీల్ కుమార్ మోడీ కీలక పాత్ర పోషించారు. జీఎస్టీ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఆర్థిక మంత్రులకు మద్దతు పలికారు. జీఎస్టీకి అనుకూలంగా ఆయన నిరంతరం స్వరం పెంచుతూనే ఉన్నారు. ఆర్థిక విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది.
మొదట 2005 నవంబర్ నుంచి 2013 జూన్ వరకు, ఆ తర్వాత 2017 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు 11 ఏళ్ల పాటు బీహార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ మోడీ జేడీయూకు చెందిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో కలిసి పనిచేశారు. తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. లాలూ, నితీష్ వంటి వారితో కలిసి 1974 జేపీ ఉద్యమం నుండి బయటకు వచ్చిన ఆయన బీహార్ బీజేపీ వ్యవస్థాపకుడు కైలాష్పతి మిశ్రా తరువాత అత్యంత ప్రభావవంతమైన బీజేపీ నాయకుడిగా ప్రసిద్ది చెందారు.
దక్షిణాదిలో బీజేపీ జెండా ఎగరడం పక్కా.. అమిత్ షా కామెంట్స్ వైరల్