Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి ఓటర్ల ఐడీని తనిఖీ చేయవచ్చా ?  

హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లతకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డును అభ్యర్థి తనిఖీ చేయవచ్చా ? అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇంతకీ అభ్యర్థి పాత్ర ఏమిటి? ఓటు కార్డును తనిఖీ చేసే హక్కు వారికి ఉందా ? పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డును పోలీసులు తనిఖీ చేయవచ్చా ? ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.  

BJP Madhavi Latha Asks Muslim Women To Show Face For ID Check, Sparks Row KRJ
Author
First Published May 14, 2024, 8:11 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవాడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకోగా.. తెలంగాణలో మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 

ఈ నేపథ్యంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఓటింగ్ సమయంలో అభ్యర్థి పోలింగ్ బూత్ వద్ద ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డును తనిఖీ చేయవచ్చా ? అనే సందేహాం వెలువబడింది.  అందులో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లతకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. వారి ముఖాలను కార్డులతో సరిపోల్చడం. ముస్లిం ఓటర్ల బురఖా తొలగించి ముఖాలు చూపించడం పై పలువురు మాట్లాడుతున్నారు. అయితే మాధవి లతను ప్రశ్నించగా.. ఇది నా హక్కు అని చెప్పింది. పోలింగ్ కేంద్రానికి చేరుకుని అభ్యర్థి ఇలా చేయవచ్చా అని సోషల్ మీడియాలో ఈ ప్రశ్న అడుగుతోంది.

పోలింగ్ స్థలంలో ఓటింగ్‌లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు, పార్టీల అధీకృత పోలింగ్ ఏజెంట్లు అక్కడ ఉన్నారు. వారు అక్కడ నిఘా ఉంచుతారు. అయితే అక్కడ అభ్యర్థి పాత్ర ఏమిటి, ఓటు కార్డును తనిఖీ చేసే హక్కు వారికి ఉందా ? పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డును పోలీసులు తనిఖీ చేయవచ్చా ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

అభ్యర్థి ఓటర్ ఐడీని చెక్ చేయవచ్చా ?

పోలింగ్  కేంద్రం వెలుపల  ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేసే హక్కు ఏ అభ్యర్థికీ లేదని సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ అన్నారు. ఇది ఎన్నికల సంఘం పని. పోలింగ్  స్టేషన్ లోపల నియమించిన అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ఓటరు కార్డు లేదా ఏదైనా అధీకృత గుర్తింపు కార్డును తనిఖీ చేసే హక్కు ఉంటుంది.

ఓటర్లు నిరసన తెలపగలరా ?

సుప్రీంకోర్టు న్యాయవాది ఆశిష్ పాండే మాట్లాడుతూ పోలింగ్ స్థలంలో పోలింగ్ ఏజెంట్ లేదా పార్టీ అభ్యర్థికి ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆటంకం కలిగించే లేదా ఓటర్లకు ఇబ్బంది కలిగించే ఏ విధమైన పని చేసే హక్కు లేదు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి ఏదైనా గుర్తింపు కార్డు చూపించమని అడిగితే, మీరు దానిని తిరస్కరించవచ్చు. రాజ్యాంగపరంగా వారికి అలా చేసే హక్కు లేదు. ఏదేనా పార్టీ బూత్‌లో గందరగోళం ఉందని లేదా ఏదైనా జరగవచ్చని భావిస్తే, వారు తమ ఏజెంట్లను అక్కడ మోహరించవచ్చు. కానీ ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించే హక్కు వారికి  లేదు. అయితే, ఇతర పక్షానికి చెందిన ఎవరైనా వ్యక్తి లేదా ఏజెంట్ దీనికి సంబంధించి ఎటువంటి అభ్యంతరం నమోదు చేయకపోతే, ఎలాంటి కేసు నమోదు చేయరాదు.  

పోలీసులకు ఆ హక్కు ఉందా ?

పోలీసులు ఓటరు ఐడీని తనిఖీ చేయవచ్చా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని దూబే మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించేటప్పుడు, మోహరించిన పోలీసు అధికారులు గుర్తింపు కోసం మాత్రమే ఏదైనా పత్రాన్ని ఖచ్చితంగా అడగవచ్చు. ఏదైనా గందరగోళం ఏర్పడితే, ఓటర్లు తమ అభ్యంతరాలను  పోలింగ్ స్టేషన్‌లోని పార్టీల అధికార ప్రతినిధి అధికారుల ముందు నమోదు చేసుకోవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios