Asianet News TeluguAsianet News Telugu

బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరి మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయ్యి. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఆ బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

While driving the bus, the driver suffered a heart attack, lost control and rammed into other vehicles, killing two
Author
First Published Dec 3, 2022, 1:39 PM IST

బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో బస్సును అతడి కంట్రోల్ లేకుండా పోయింది. ఎదురుగా వచ్చే వాహనాలపైకి దూసుకెళ్లింది. పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం.. కిటికీలోంచి దూకిన బాలిక..

వివరాలు ఇలా ఉన్నాయి. జబల్‌పూర్‌లో జిల్లాలో దమోహ్నక నుండి బరేలా మార్గంలో శుక్రవారం ఓ మెట్రో సిటీ బస్సు ప్రయాణిస్తోంది. అయితే ఉదయం 11 గంటల సమయంలో గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోకి చేరుకునేసరికి 50 ఏళ్ల డ్రైవర్ హర్దేవ్ పాల్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు డ్రైవింగ్ సీట్లో ఉండగానే మరణించాడు. బస్సు ప్రయాణంలో ఉండటంతో కంట్రోల్ కాలేదు. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది. ఇలా బస్సు వాహనాలను ఢీకొడుతూ వెళ్లిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాలకు డుమ్మా! భారత్ జోడో యాత్రపై ఫోకస్

ఇలా బస్సు ఢీకొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ లు ఆగి ఉన్న సమయలో ఇది చోటు చేసుకుంది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న హర్దేవ్ పాల్ ను బయటకు తీసుకొచ్చి, హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా.. 20 పీఏ 0764 నెంబర్ గల బస్సు రాణిటాల్‌కు వెళ్తోందని, డ్రైవర్ హర్దేవ్ పాల్ సింగ్‌కు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని జబల్‌పూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో సచిన్ విశ్వకర్మ తెలిపారు.

తెలియని పెళ్లికి వెళ్లి ఫుడ్ తిన్న విద్యార్థి... వీడియో తీసి మరీ....!

ఇదిలా ఉండగా.. తమిళనాడు రాష్ట్రంలో మార్చి నెలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కడలూరు జిల్లాలో పాఠశాల బస్సును నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అతడు స్టీరింగ్ పై కుప్పకూలిపోయాడు. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

వెంటనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. డ్రైవర్ ను సీటు నుంచి బయటకు తీశారు. కానీ అతడు అప్పటికే చనిపోయాడని వైద్య సిబ్బంది ప్రకటించారు. కాగా.. డ్రైవర్‌ను 43 ఏళ్ల ప్రభుగా గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios