Asianet News TeluguAsianet News Telugu

తెలియని పెళ్లికి వెళ్లి ఫుడ్ తిన్న విద్యార్థి... వీడియో తీసి మరీ....!

కొందరు పెళ్లితో సంబంధం లేకుండా.. వచ్చి భోజనం రుచి చూస్తూ ఉంటారు. తాజాగా... ఓ విద్యార్థి కూడా తెలియని పెళ్లికి వెళ్లి భోజనం చేశాడు. దానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

Student Crashes Wedding To Eat Food, This Was The Groom's Hilarious Response
Author
First Published Dec 3, 2022, 12:31 PM IST

పెళ్లి అంటే ఒక సంబరం. వధూవరుల జీవితంలో కొత్త సంతోషాలను తీసుకువస్తుంది. అంతేకాదు... వారి బంధువులు, స్నేహితుల జీవితాల్లోనూ పెళ్లి ఒక మధురానుభూతిగా మారుతుంది. ఈ వివాహ వేడుకల్లో ఎక్కడెక్కడి స్నేహితులు, బంధువులు కూడా ఒకచోట కలుసుకుంటారు. ఈ పెళ్లిలో మరో ముఖ్యమైన విషయం ఆహారం. రకరకాల వంటలను పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డిస్తూ ఉంటారు. అయితే... మీరు గమనించే ఉంటారు.. కొందరు పెళ్లితో సంబంధం లేకుండా.. వచ్చి భోజనం రుచి చూస్తూ ఉంటారు. తాజాగా... ఓ విద్యార్థి కూడా తెలియని పెళ్లికి వెళ్లి భోజనం చేశాడు. దానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

అయితే... కామ్ గా పెళ్లి భోజనం చేసి రాకుండా... ఆ విషయాన్ని వరుడికి కూడా చెప్పి రావడం గమనార్హం. పెళ్లికి శుభాకాంక్షలు చెప్పి... తాను సంబంధం లేకుండా.. వచ్చి ఈ భోజనం చేశానని అతను చెప్పడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

బిహార్ కి చెందిన  అలోక్ యాదవ్ అనే విద్యార్థి... తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో షేర్ చేసిన 48 గంటల్లో దాదాపు 1.5 మిలియన్లకు పైగా వ్యస్ రావడం గమనార్హం. అతను హాస్టల్ లో ఉంటాడట. హాస్టల్ ఫుడ్ అస్సలు బాగోదట. దానికి తోడు అతనికి విపరీతంగా ఆకలి వేసిందట. దీంతో... పక్కనే పెళ్లి జరుగుతుంటే అక్కడకు వెళ్లాడు. చక్కగా అక్కడ భోజనం ఆరగించాడు. అక్కడ ఎవరూ అతనిని గుర్తించకపోవడం గమనార్హం.

అయితే...భోజనం చేసిన తర్వాత వెళ్లి వరుడికి తన విషయం మొత్తం చెప్పాడట. నేను ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని వరుడిని ప్రశ్నించాడట. అందుకు ఆ వరుడు.. నవ్వుతూ తనకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి... వెళ్లేటప్పుడు.. హాస్టల్ కి కూడా కొంచెం భోజనం తీసుకువెళ్లమని చెప్పడం గమనార్హం. దీంతో.... ఆ విద్యార్థి సంతోషంగా.... వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుంచి వెళ్లడం గమనార్హం. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విద్యార్థి చాలా నిజాయితీ పరుడు అంటూ... ప్రశంసించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios