Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ ఐట‌మ్స్ త‌యారీలో ఏ ప‌దార్థాలు వాడుతున్నారో స్ప‌ష్టంగా ప్ర‌చురించాలి- ఢిల్లీ హైకోర్టు

ఆహార పదార్థాల తయారీ కోసం ఏ పదార్థాలను ఉపయోగిస్తున్నారో ఆ ప్యాకింగ్ పై స్పష్టంగా చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాంసం నుంచి సేకరించిన పదార్థాలు వాడినప్పటికీ ప్యాకింగ్ లపై గ్రీన్ లేబుల్ వేస్తున్నారని చెప్పింది.

What ingredients are used in the preparation of food items should be clearly published - Delhi High Court
Author
Delhi, First Published Dec 14, 2021, 6:52 PM IST

తినే ఆహార‌ప‌దార్థాల త‌యారీ కోసం ఏ ఏ ప‌దార్థాలు వాడుతున్నారో ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మ‌య్యేలా స్ప‌ష్టంగా  ప్ర‌చురించాల‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల‌ను ఆహార ప‌దార్థాల త‌యారుదారులు అంద‌రూ క‌చ్చింత‌గా పాటించాల‌ని చెప్పింది. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించే వ‌స్తువులు జంతువుల మూల‌ల‌కు చెందిన‌వై ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ప్యాకింగ్‌ల‌పై గ్రీన్ లేబుల్ వేస్తున్నార‌ని హైకోర్టు తెలిపింది. ఇలా వేయ‌డం వ‌ల్ల అది శాఖాహారం అని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని పేర్కొంది. 

కార్గో లోడ్ చేసి అలిసి విమానంలోనే నిద్ర.. కళ్లు తెరిస్తే అబుదాబిలో.. ఆ తర్వాత..
తమ ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే ప‌దార్థాల స్వభావం ఆధారంగా లేబుల్ చేయాలని ప్ర‌స్తుతం ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు అవ‌స‌ర‌మైన మార్గదర్శకాలను జారీ చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ పై మంగ‌ళ‌వారం హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 ప్ర‌కారం ఆహార ప‌దార్థాల త‌యారీ యూనిట్ల‌లోని లోపాల‌ను త‌నిఖీ చేయ‌డంలో కేంద్ర ప్రభుత్వం, FSSAI సంస్థ విఫ‌ల‌మ‌య్యింద‌ని పేర్కొంది. ఇలా లోపాల‌ను గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పింది. ప్ర‌త్యేకించి శుద్ద‌మైన శాఖాహారాన్ని తినాల‌నుకునే వారిని ఇది మోసం చేయ‌డమే అవుతుంద‌ని తెలిపింది. సాధారణంగా ఇన్‌స్టంట్ నూడుల్స్ లేదా బంగాళదుంప చిప్స్‌లో కనిపించే డిసోడియం ఇనోసినేట్ అనే పదార్ధం వాణిజ్యపరంగా మాంసం లేదా చేపల నుండి తయారు చేస్తార‌ని తెలిపింది. దీంతో పాటు తరచుగా పంది కొవ్వు నుంచి తీసుకుంటార‌ని పేర్కొంది. కానీ బంగాళాదుంప చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్ల‌పై వెజిటేరియ‌న్ అని సూచించే విధంగా గ్రీన్ లేబుల్ ఉంటోంద‌ని కోర్టు ఉద‌హ‌రించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇవి తినే ఆహార‌ప‌దార్థాలు తినే ప్ర‌జ‌ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన‌ట్టే అవుతుంద‌ని, కాబ‌ట్టి ఇది చ‌ట్ట రిత్యా శిక్షార్హమైన త‌ప్ప‌ని చెప్పింది. ఇప్ప‌టి నుంచైనా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు నిబంధనలను పూర్తిగా, కచ్చితంగా పాటించేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది.

బూస్టర్ డోసు అవసరమా?.. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం.. హైకోర్టులో కేంద్రం సమాధానం

Follow Us:
Download App:
  • android
  • ios