పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు....అందుకే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అది అక్షరాల నిజమైంది ఒక జంట విషయంలో. వరదలు ముంచెత్తుతున్నా కళ్యాణం మాత్రం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు బంధు మిత్రులు మధ్య ఎంతో ఘనంగా జరగాల్సిన పెళ్లి పునరావాసంలో తమతోపాటే ఉంటున్న తోటి బాధితులే బంధువులు అయ్యారు...
యశ్వంతపుర: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు....అందుకే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అది అక్షరాల నిజమైంది ఒక జంట విషయంలో. వరదలు ముంచెత్తుతున్నా కళ్యాణం మాత్రం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు బంధు మిత్రులు మధ్య ఎంతో ఘనంగా జరగాల్సిన పెళ్లి పునరావాసంలో తమతోపాటే ఉంటున్న తోటి బాధితులే బంధువులు అయ్యారు...జిల్లా కలెక్టర్ అధికారులు ముఖ్యఅతిథులుగా హాజరై వారిని దీవించారు. ఇంతకీ ఈ వివాహం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా...కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో.
కొడగు జిల్లాను గతకొద్దిరోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొడగు జిల్లా మడికెరి తాలూకా మక్కందూరుకు చెందిన మంజుల, కేరళలోని కణ్ణూరు కుతుపరంబుకు చెందిన రాజేష్‌లకు ఈ నెల 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.
మరో 10రోజుల్లో పెళ్లి ఉందనగా కొడగు జిల్లాను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా మంజుల ఇల్లు నీటమునిగింది. పెళ్లి దుస్తులు, నగదు, బంగారు మొత్తం వరద ఉధృతికి కొట్టకుపోయాయి. దీంతో ఆ కుటుంబం పునరావాస కేంద్రంలో తలదాచుకుంది.
పెళ్లికి ఏమీ లేకపోవడంతో పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న మడికెరి లయన్స్‌క్లబ్, సేవా భారతి సభ్యులు వారి పెళ్లి జరిపించడానికి సిద్ధమయ్యారు. మడికెరిలోని ఓంకారేశ్వరి దేవస్థానంలో అనుకున్న ముహూర్తానికే వైభవంగా పెళ్లి చేసి మంజుల, రాజేష్‌లను ఆశీర్వదించారు. అనుకోకుండా జరిగిన ఈ పెళ్లికి అనుకోని అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీవిద్యతోపాటు పలువురు అధికారులు హాజరై దంపతులను ఆశీర్వదించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సహాయక శిబిరమే పెళ్లి మండపం....కేరళలో ఒక్కటైన జంట
వర్షం ఎఫెక్ట్: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటిన పెళ్లికూతురు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 1:54 PM IST