Asianet News TeluguAsianet News Telugu

సహాయక శిబిరమే పెళ్లి మండపం....కేరళలో ఒక్కటైన జంట

వివాహం అంటేనే ముహూర్తం చాలా ముఖ్యం. శ్రావణ మాసం ఆగష్టు 19న ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో వరదలు...ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో పెళ్లి జరగదేమో అనుకున్నారు. ఓ వైపు వరదలు.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న అనుకున్న ముహూర్తానికి ఆజంట ఒక్కటైంది. 

a wedding in Kerala relief camp
Author
Kerala, First Published Aug 19, 2018, 6:38 PM IST

కేరళ: వివాహం అంటేనే ముహూర్తం చాలా ముఖ్యం. శ్రావణ మాసం ఆగష్టు 19న ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో వరదలు...ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో పెళ్లి జరగదేమో అనుకున్నారు. ఓ వైపు వరదలు.. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న అనుకున్న ముహూర్తానికి ఆజంట ఒక్కటైంది. 

ఇప్పటికే అర్థమై ఉంటుంది...అదెక్కడో కాదు కేరళ రాష్ట్రంలోనే. అయితే ఈ పెళ్లికి ఓ విశేషముందండోయ్...ఏంటంటే సహాయక శిబిరమే పెళ్లిమండపం అయ్యింది. ఇకపోతే పెళ్లంటే కుటుంబ సభ్యులు..బంధువుల మధ్య జరగాల్సిన తంతు కాస్తా తమతోపాటే సహాయక శిబిరంలో ఆశ్రయం పొందుతున్న వారి మధ్య జరగడం విశేషం. వరదలతో తొలుత పెళ్లి వాయిదా వేసుకోవాలని ఆ జంట నిర్ణయించినా.. శిబిరంలో ఉన్న తోటివారు సహాయక సహకారాలు అందివ్వడంతో అనుకున్న సమయానికే ఆ జంట ఒక్కటయ్యింది.

కేరళలోని మళప్పురానికి చెందిన అంజుకు.. సైజు అనే యువతితో వివాహం జరగాల్సి ఉంది. 3 రోజుల క్రితం వారుంటున్న ప్రాంతం వరదల కారణంగా నీట మునిగింది. దీంతో ఆ జంటతో పాటు వారి బంధువులు దగ్గరలోని ఓ స్కూల్‌లోని సహాయక శిబిరంలో సేదతీరుతున్నారు. భయంకర వాతావరణాన్ని చూసి పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. 

అయితే పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నమిగిలిన వారికి విషయం తెలియడంతో పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు. అనుకున్న సమయానికి పెళ్లి చేశారు. వివాహం జరగాల్సిన ఆలయానికి ట్రస్టీగా వ్యవహరిస్తున్న వ్యక్తి వివాహ విందు ఏర్పాటు చేయడం మరో విశేషం. మళప్పురం జిల్లాలోని మరో రెండు చోట్ల కూడా ఇలాంటి వివాహాలే జరిగినట్లు సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios