Asianet News TeluguAsianet News Telugu

టాప్‌-10 ధ‌న‌వంతుల సంప‌ద‌తో 25 ఏండ్లు అంద‌రికీ విద్య‌ను అందించ‌వ‌చ్చు:ఆక్స్ ఫామ్ రిపోర్టు

inequality survey: ఆరోగ్యం, విద్య‌, సామాజిక భ‌ద్ర‌త వంటి అంశాల‌పై ప్ర‌భుత్వాలు వ్య‌యాలు అధికంగా లేక‌పోవ‌డంతో పాటు ఆయా అంశాల విష‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు పేద‌ల‌కు శాపంగా మారుతున్నాయ‌ని తాజా నివేదిక పేర్కొంది. ఈ క్ర‌మంలోనే పేద‌ల ప‌రిస్థితులు ద‌య‌నీయంగా మారుతుండ‌గా.. ధ‌న‌వంతులు మ‌రింతగా త‌మ సంప‌ద‌ను పెంచుకుంటూ అప‌ర కుబేరులుగా మారుతున్నార‌ని ఆక్స్ ఫామ్ విడుద‌ల చేసిన ఇనీక్వాలిటీ స‌ర్వే రిపోర్టు పేర్కొంది. భార‌త్ లోని టాప్‌-10 ధ‌న‌వంతుల సంప‌ద‌తో 25 ఏండ్ల పాటు దేశంలోని ప్ర‌తి బిడ్డ‌కు విద్య‌ను అందించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. 
 

Wealth of India's 10 richest enough to fund education of every child for 25 years: Study
Author
Hyderabad, First Published Jan 18, 2022, 4:45 AM IST

Oxfam inequality survey: భార‌త్ క‌రోనా స‌మ‌యంలో పేద‌లు కూడు, గూడు, గుడ్డ కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతుండ‌గా, అదే స‌మ‌యంలో బిలియ‌నీర్లు, ధ‌నికులు మ‌రింత సంప‌ద‌ను పోగేసుకుంటూ అప‌ర కుబేరులుగా మారుతున్నార‌ని ఓ స‌ర్వే రిపోర్టు పేర్కొంది. ఆరోగ్యం, విద్య‌, సామాజిక భ‌ద్ర‌త వంటి అంశాల‌పై ప్ర‌భుత్వాలు వ్య‌యాలు అధికంగా లేక‌పోవ‌డంతో పాటు ఆయా అంశాల విష‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు పేద‌ల‌కు శాపంగా మారుతున్నాయ‌ని ఆక్స్ ఫామ్ ఇనీక్వాలిటీ స‌ర్వే నివేదిక పేర్కొంది. ఈ క్ర‌మంలోనే పేద‌ల ప‌రిస్థితులు ద‌య‌నీయంగా మారుతుండ‌గా.. ధ‌న‌వంతులు మ‌రింత త‌మ సంప‌ద‌ను పెంచుకుంటూ అప‌ర కుబేరులుగా మారుతున్నార‌ని తెలిపింది. భార‌త్ లోని టాప్‌-10 ధ‌న‌వంతుల సంప‌ద‌తో 25 ఏండ్ల పాటు దేశంలోని ప్ర‌తి బిడ్డ‌కు విద్య‌ను అందించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతీయ బిలియనీర్లు తమ సంపదను రెట్టింపు కంటే ఎక్కువగా పోగుచేసుకున్నార‌ని తెలిపింది. బిలియ‌నీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 142కి చేరుకుంద‌ని వెల్ల‌డించింది. 

దేశంలోని 100మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని 'ఆక్స్‌ఫాం ఇండియా' తాజా నివేదిక తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు కార్పొరేట్స్‌, ధనికుల సంపద పెరగడానికి ఉపయోగపడ్డాయ‌ని పేర్కొంది. అయితే, ఇదే స‌మ‌యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక విధానాలు పేద, మధ్య తరగతికి చెందిన కోట్లాది కుటుంబాల్ని పేదరికంలోకి నెట్టివేశాయ‌ని తెలిపింది. దేశంలోని సంప‌ద అతి త‌క్కువ మంది వ‌ద్దే పోగు అవ‌డానికి కార‌ణ‌మైంద‌ని పేర్కొంది. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2021లో 102 నుంచి 142కి పెరిగింద‌ని తెలిపింది. దేశంలోని టాప్-10 మంది ధనవంతుల వ‌ద్ద ఉన్న సంప‌ద‌తో దేశంలోని అన్ని పాఠశాలలు .. కళాశాలలను రాబోయే 25 సంవత్సరాల పాటు నిర్వహించవ‌చ్చ‌ని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక వెల్ల‌డించింది. 10 శాతం సంపన్నుల వద్ద దేశ సంపదలో 45 శాతం ఉంద‌ని పేర్కొంది. అదే సమయంలో, దేశంలోని 50 శాతం పేద జనాభా వద్ద కేవలం 6 శాతం సంపద మాత్రమే ఉంద‌ని తెలిపింది. అంటే దేశంలో ధ‌నికుల మ‌రింత‌గా సంప‌ద‌ను పోగేసుకుంటూ ఉంటే.. పేద‌లు మ‌రింత‌గా దిగ‌జారుతున్నార‌ని విష‌యాన్ని ఈ నివేదిక నొక్కి చెప్పింది. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్  ఆన్ లైన్ దావోస్ ఎజెండా శిఖరాగ్ర సమావేశం మొదటి రోజున విడుదల చేసిన వార్షిక అసమానత సర్వేలో.. దేశంలోని టాప్-10 ధ‌న‌వంతుల‌పై ఒక్క శాతం అదనపు పన్ను విధిస్తే, ఆ డబ్బు నుంచి దేశం 17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను అదనంగా పొందుతుందని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో దేశంలోని 98 ధ‌నిక కుటుంబాలపై 1 శాతం  అదనపు పన్ను విధిస్తే వ‌చ్చే డ‌బ్బుతో ఏడేండ్ల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించ‌వ‌చ్చున‌ని పేర్కొంది. దేశంలోని 142 మంది బిలియనీర్ల మొత్తం సంపద 719 బిలియన్ డాలర్లు, అంటే 53 లక్షల కోట్ల రూపాయలు. 555 కోట్ల మంది పేదలకు ఉన్న సంపద 98 మంది ధనవంతుల వద్ద ఉంద‌ని ఆక్స్ ఫామ్ ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్టు పేర్కొంది. అంటే దాదాపు  49 లక్షల కోట్ల రూపాయలు. ఈ 98 కుటుంబాల మొత్తం సంపద భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో 41 శాతంగా ఉంద‌ని తెలిపింది. అలాగే, దేశంలోని టాప్‌-10 ధ‌న‌వంతుల వ‌ద్ద ఉన్న సంప‌ద‌ను వారు రోజుకూ 7.4 కోట్లు ఖర్చు చేసినా, వారి సంపద ఖర్చు చేయడానికి 84 సంవత్సరాలు పడుతుంద‌ని పేర్కొంది. వీరిపై అద‌న‌పు  ప‌న్ను విధిస్తే.. వ‌చ్చే డబ్బుతో ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ 271 శాతం పెరుగుతుంద‌ని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios