వామ్మో.. మెడలో పాములు వేసుకొని తిరిగిన వ్యక్తి.. అందరూ విషసర్పాలను వేస్తున్నా.. అభివాదం చేస్తూ.. వీడియో వైరల్
ఓ వ్యక్తి తన మెడలో కుప్పలు, కుప్పలుగా పాములు వేసుకొని తిరిగినా.. అతడిని ఒక్క విషసర్పం కూడా కాటు వేయలేదు. అన్ని పాములు మెడపై అటు ఇటూ తిరుగుతున్నా అతడికి ఇసుమంతైనా భయం వేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది వాటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెతుంటారు. కొందరైతే ఓ ఇంట్లో పాము చొరబడిందని తెలిస్తే.. ఆ ఇంటి వైపే వెళ్లకుండా ఉంటారు. కానీ మరి కొందరు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వాటి దగ్గరికి ధైర్యంగా వెళ్తుంటారు. ఆ విష సర్పాలను పట్టుకుంటారు. వాటితో ఆడుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో కొన్ని అనుకోని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఆ విషసర్పం కాటేయడం వల్ల చనిపోయిన సందర్భాలు కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తుంటాయి.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
పలువురు పాములను జనావాసం నుంచి కాపాడి ఆడవుల్లో, ఇతర నిర్మానుష్య ప్రదేశాల్లో వదిలిపెట్టడానికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పాములకు సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కొన్ని విషసర్పాలను తన మెడలో వేసుకొని వస్తున్నాడు. అందులో చిన్నవి, పెద్దవితో పలు రకాలకు చెందిన పాములు ఉన్నాయి. అతడు అలా వస్తుంటే మరి కొందరు చుట్టూ చేరారు.
వారు కూడా అతడి మెడలో పాములను వేస్తున్నారు. వాటిలో కొన్ని కింద పడిపోతున్నాయి. మళ్లీ వాటిని మెడలో వేస్తున్నారు. కానీ అతడు మాత్రం ఎలాంటి భయమూ లేకుండా నవ్వుతూ కనిపిస్తున్నాడు. అతడిని చూసేందుకు వచ్చిన వారికి చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్నాడు. అయితే ఈ విష సర్పాల్లో ఒక్కటి కూడా అతడిని కాటేయకపోవడం ఇక్కడ గమనార్హం. ఈ దృష్యాలన్నింటినీ అక్కడున్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.