మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకం - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఆయన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్మారక ఉపన్యాసంలో ప్రసంగించారు. ఉన్నికృష్ణన్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తన కేరళ పర్యటనలో మొదటి రోజు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్మారక ఉపన్యాసంలో ప్రసంగించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ 104వ బ్యాచ్ కు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తోటి పూర్వ విద్యార్థి కల్నల్ ఎస్ డిన్నీ హాజరైన ఈ కార్యక్రమానికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు విచ్చేశారు. వారికి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఘోరం.. దళిత బాలికలను అపహరించి.. వారం రోజులుగా పలుమార్లు అత్యాచారం..
ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాటించిన విలువలను, స్ఫూర్తిదాయకంగా వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తోటి పౌరుల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన భక్తి అందరికీ విలువైన పాఠమని మంత్రి పేర్కొన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి ఆలోచించినప్పుడు ఆయన విలువలు గుర్తుకు వస్తాయని, అది మనకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. విషపూరిత రాజకీయాలు, సామాజిక మాధ్యమాల మధ్య ఈ విలువలు ఏదో విధంగా నీరుగారిపోతున్నాయని తెలిపారు.
‘‘ఉన్నికృష్ణన్ వంటి యోధులు ప్రయోజనకరమైన జీవితాన్ని గడిపారు. అది అతడిని అందరితో భిన్నంగా చేసింది. సేవ, సమగ్రత, భారతదేశ భావన పట్ల నిబద్ధత ఆయన లక్ష్యం. తన తోటి పౌరుల పట్ల ఆయనకు భక్తి ఉంది. ఇది మనందరికీ ఒక పాఠం కావాలి’’ అని అన్నారు. అనంతరం చరిత్రలో భారత సైనికులు చేసిన త్యాగాలను గుర్తిస్తూ యుద్ధ స్మారక చిహ్నాల ఏర్పాటుపై మంత్రి చర్చించారు. ‘‘ గత తొమ్మిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక యుద్ధ స్మారక చిహ్నాలను నిర్మించాం. మన సైనికుల నిజమైన త్యాగాన్ని ఆరాధించడానికి ఇది మాకు ప్రార్థనా స్థలం’’ అని మంత్రి తెలిపారు.
కేరళ పర్యటన సందర్భంగా సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శివగిరి మఠంలో ఉన్న శ్రీ నారాయణ గురు మహా సమాధి మందిరాన్ని సందర్శించారు. అక్కడి మఠం సీనియర్ అధికారులు, శ్రీ నారాయణ గురు మహదేవన్ పలువురు అనుచరులతో కలిసి నిర్మాణాత్మక చర్చలు జరిపారు. ఆయన వెంట మఠం ప్రధాన కార్యదర్శి స్వామి శుభాంగానంద స్వామీజీ, స్వామి రితంబరానంద స్వామీజీ, శారదానంద స్వామీజీలు, విశాలానంద స్వామీజీలు, హంసతీర్థ స్వామీజీలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుదేవ సమాధి సందర్శన, ఆశీర్వాదం, స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివగిరి మఠాన్ని సందర్శించడం ఇదే తొలిసారిని గుర్తు చేశారు. మఠానికి, సమాజానికి జ్ఞానోదయం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోడీ, భారత ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తున్నాయని అన్నారు.
భర్తను పక్క గదిలో బంధించి.. భార్యపై 11 మంది సామూహిక అత్యాచారం
అనంతరం రాజీవ్ చంద్రశేఖర్ అమృతపురిలో మాతా అమృతానందమయిని కలుసుకున్నారు. అక్కడ వారి చర్చలు సమాజానికి మేలు చేసే కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మఠం చేస్తున్న ప్రయత్నాల చుట్టూ జరిగింది. పరిశోధన, ఉన్నత విద్యలో సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు అభివృద్ధి ప్రాముఖ్యతను మంత్రి నొక్కి చెప్పారు. నవభారత నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వ కార్యక్రమాలపై 'అమ్మ'తో తన సంభాషణలో అంతర్దృష్టులను అందించారు. 54 కళాశాలల విద్యార్థులతో మమేకం కావడం, స్టార్టప్ ల పట్ల వారి ఉత్సాహాన్ని చూడటం, సృజనాత్మకత కోసం వారి తపన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని అంగీకరించడం వంటి తన వ్యక్తిగత అనుభవాలను ఆయన వివరించారు.