ఆరేళ్ల నుంచి ఉత్తరప్రదేశ్ లో క్రైమ్ ను అదుపులో ఉంచామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు. అందుకే పెట్టుబడులు కూాడా పెరుగుతున్నాయని చెప్పారు. 

సుపరిపాలనే న్యాయపాలనకు ప్రధాన కారణమని, గత ఆరేళ్లలో క్రైమ్ ను అదుపులో ఉంచామని, యూపీని నేర రహితంగా, అల్లర్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన ఉన్నందున, పెట్టుబడులకు ఉత్తర ప్రదేశ్ అద్భుతమైన, సురక్షితమైన ప్రాంతంగా అవతరించిందని ఆయన అన్నారు. సోమవారం యూపీలోని గోరఖ్ నాథ్ పోలీస్ స్టేషన్, ఎయిమ్స్ పోలీస్ స్టేషన్, పరిపాలనా భవనాన్ని ఆయన ప్రారంభించారు.

2024పై కాదు.. 2047పై దృష్టి పెట్టండి - మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన

ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘‘సుపరిపాలన అనేది చట్టబద్ధ పాలనకు ప్రాథమిక షరతు. గత ఆరేళ్లలో రాష్ట్రాన్ని నేర రహితంగా, అల్లర్లు లేని, అరాచక రహితంగా మార్చిన తర్వాత చట్టబద్ధ పాలన ఏర్పడింది. నేరాలు, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానం ఫలితమే ఇది’’ అని అన్నారు.

ఇప్పుడు అన్ని పండుగలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచకాలకు తావులేదని అన్నారు. బక్రీద్, రామనవమి, ఈద్ పండుగలన్నీ సుఖసంతోషాలతో జరుపుకున్నామని, ఎలాంటి అల్లర్లు జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి నెలకొనడంతో ఉత్తరప్రదేశ్ కు రూ .36 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. అవి క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు, యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన (వీడియో)

ఈ సందర్భంగా సీఎం యోగి ఉత్తరప్రదేశ్ లోని గత ప్రభుత్వాలను విమర్శించారు. ఆరేళ్ల కిందట రాష్ట్రంలో అరాచకాలు, గూండాయిజం తారాస్థాయికి చేరాయన్నారు. అమ్మాయిలు, వ్యాపారవేత్తలు ఎవరూ సురక్షితంగా లేరని అన్నారు. పండుగల సందర్భంగా భయానక వాతావరణం నెలకొనేదని తెలిపారు. గత ఆరేళ్లుగా పోలీసింగ్ రంగంలో జరుగుతున్న కృషి ఫలితంగా నేడు రాష్ట్రంపై ప్రజల్లో ఉన్న భయాలు పోయాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని, అందుకే అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతోందన్నారు. స్మార్ట్ పోలీసింగ్, పోలీస్ హౌసింగ్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కు నిప్పుపెట్టిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. తీవ్రంగా ఖండించిన అమెరికా
అనంతరం రాప్తి నదిపై ఉన్న గురు గోరక్షనాథ్ ఘాట్ వద్ద రెండు రోజుల గురు గోరక్షనాథ్ మహోత్సవ్ ను సీఎం ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ మనల్ని సరైన, సానుకూల దిశలో పయనించడానికి ప్రేరేపిస్తుందని, నెగెటివిటీకి జీవం ఉండదని, ఇది మన శక్తిని తగ్గిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడానికి కళ ఒక శక్తివంతమైన వేదిక అని తెలిపారు.