శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కు ఖలిస్థాన్ మద్దతుదారులు నిప్పుపెట్టిన ఘటనపై అమెరికా స్పందించింది. దానిని ఖండించింది. యూఎస్‌లోని దౌత్య సదుపాయాలపై విధ్వంసం జరపడం చట్టరీత్యా నేరం అని తెలిపింది. 

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కు ఖలిస్థాన్ మద్దతుదారులు తెల్లవారుజామున నిప్పుపెట్టారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. జూలై 2, 2023న ఖలిస్తాన్ మద్దతుదారులు ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియోలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ వద్ద జరిగిన అగ్నిప్రమాదాన్నిచూపిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన (వీడియో)

అయితే ఈ ప్రమాదంలో పెద్ద నష్టం సంభవించలేదు. సిబ్బందికి గాయాలైనట్టు కూడా సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంగళవారం ఉదయం స్థానిక న్యూస్ ఛానెల్ దియా టీవీ షేర్ చేసింది. దీనిపై యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందిస్తూ.. “శనివారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం, దహన ప్రయత్నాన్ని యూఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. యూఎస్‌లోని దౌత్య సదుపాయాలు లేదా విదేశీ దౌత్యవేత్తలపై విధ్వంసం లేదా హింస చట్టరీత్యా నేరం” అని ఆయన ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

కాగా.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్‌లు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో, ఖలిస్తానీ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు దేశవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో ఖలిస్తానీ మద్దతుదారులు కాన్సులేట్‌ను ధ్వంసం చేశారు.

Scroll to load tweet…

భారత కాన్సులేట్‌పై భారీ సంఖ్యలో అక్కడి ఖలిస్తానీలు దాడి చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో కాన్సులేట్ ప్రాంగణంలో ఖలిస్తాన్ అనుకూల బ్యానర్‌లను ఏర్పాటు చేయడానికి నిరసనకారులు భద్రతా అడ్డంకులను కూడా ఛేదించారు. ఇనుప రాడ్లతో ఉన్న తలుపులు, కిటికీలు పగులగొట్టేందుకు కూడా ప్రయత్నించారు.