మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి సమయంలో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. 

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వాహనాన్ని తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాయాలతో అక్కడే మృతి చెందిన పోలీసు..

అనంతరం ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ ప్రత్యక్షమైంది. భారీ మంటలు ఆ భవనాన్ని చుట్టుముట్టడం అందులో కనిపిస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ గోడౌన్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని కుర్లా ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. సిప్రీ బజార్ ప్రాంతంలోని మూడంతస్తుల రెండు ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్స్ షోరూమ్, ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయం, మూతపడిన కోచింగ్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ షాప్‌ను దగ్ధమయ్యాయి

పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి

ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మంటలు చుట్టుముట్టిన ఐదుగురు రెండో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే.. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. షోరూం బయట, బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన 100కు పైగా ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. అగ్నిప్రమాదంలో రూ.35 నుంచి 40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.