2024పై కాకుండా భారతదేశం 100 ఏళ్ల స్వతంత్ర వేడుకలు జరుపుకునే 2047పై అందరూ ఫోకస్ పెట్టాని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం జరిగిన సమావేశంలో.. 2047 విజన్, రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు వంటి 16 ముఖ్యమైన రంగాల్లో మౌలిక సదుపాయాలపై తన మంత్రులతో మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికలు జరగనున్న 2024 సంవత్సరంపై కాకుండా.. దానికి మించి అందరూ తమ దృష్టిని మళ్లించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే 2047 సంవత్సరానికి లక్ష్యాల దిశగా పనిచేయాలని తన మంత్రులకు సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం జరిగిన తన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన (వీడియో)
ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా పాల్గొన్నారు. మంత్రిమండలితో ఫలవంతమైన సమావేశం జరిగిందని, వివిధ విధానపరమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నామని సమావేశం అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
‘‘ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చలు జరగలేదు. 2047 విజన్, రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు వంటి 16 ముఖ్యమైన రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మాత్రమే చర్చలు జరిగాయి. ప్రధాని మోడీ కూడా 2024 పనులకు ఊతమిచ్చారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ‘ఇంగ్లీష్ జాగరణ్’ నివేదించింది.
భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాల్లో ఆశించిన వృద్ధి ప్రయాణంపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు నివేదిక వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ, పౌర విమానయానం, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా చేసిన కృషిని ఈ సమావేశంలో వివరించినట్లు వారు పేర్కొంది.
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న తన దార్శనికతను ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే వ్యక్తం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ అనివార్యమైన పరిస్థితుల తరువాత డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఊతమివ్వడంపై కూడా ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై త్వరితగతిన పనిచేయాలని మంత్రిత్వ శాఖలకు ప్రధాని పిలుపునిచ్చినట్లు తెలిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.
ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో నలుగురికి గాయాలు
కాగా.. ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండటం, 2024లో లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో జీ-20 సమావేశం జరగనుంది.
