మణిపూర్ పై చర్చించడానికి మొదటి నుంచీ సిద్ధంగా ఉన్నాం.. విపక్షాలు ఎందుకు పారిపోతున్నాయ్ - అనురాగ్ ఠాకూర్
మణిపూర్ పై చర్చించడానికి తాము మొదటి నుంచీ సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలే పారిపోతున్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు మణిపూర్ లో పర్యటించిన విపక్షాల బృందం, అక్కడ చూసిన విషయాలను చర్చలో పంచుకోవాలని అన్నారు.

మణిపూర్ సమస్యపై ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఆ అంశంపై చర్చించేందుకు ఎందుకు పారిపోతున్నారంటూ ఆయన విపక్షాలను ప్రశ్నించారు. మణిపూర్ సమస్యపై చర్చించేందుకు తాము మొదటి రోజు నుంచే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రేకింగ్ : జైపూర్-ముంబై రైలులో నలుగురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్..
‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దీనిపై (మణిపూర్) పై చర్చకు ఆహ్వానించారు. ప్రతిపక్షాలు ఎందుకు పారిపోతున్నాయి. మణిపూర్ లో రెండు రోజులు విపక్షాలు పర్యటించాయి. ఈ అనుభవాలను చర్చలో ప్రతిపక్షాలు పంచుకోవాలని కోరుతున్నాను.’’ అని ఆయన అన్నారు.
గతంలో వేలాది మంది ప్రజలు మణిపూర్‌లో హతమయ్యారని, దానిని అదుపు చేయడంలో కాంగ్రెస్ విఫలమయ్యిందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ (మాజీ ప్రధాని ఇందిరాగాంధీ), రాజీవ్ గాంధీ (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు వారు మా నుంచి (ప్రతిపక్షాలు) ప్రకటన ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.
తాగేందుకు నీళ్లు అడిగాడని.. వికలాంగుడిపై దాడి చేసిన జవాన్లు.. వీడియో వైరల్
‘‘కేంద్ర హోం మంత్రి నాలుగు రోజులుగా మణిపూర్ లో ఉన్నారు. మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. లైమ్ లైట్ లో ఉండటానికి ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించకూడదు. రాజకీయాలు చేయకుండా చర్చలో పాల్గొనాలి’’ అని ఆయన అన్నారు. మణిపూర్ హింసాకాండపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందిస్తూ.. ‘‘దయచేసి బెంగాల్ పరిస్థితిపై కూడా అవగాహన పెంచుకోండి. బెంగాల్ నుంచి కూడా ఎన్నికల్లో పోరాడాలి. బెంగాల్ అంతా బాగానే ఉందా అని నేను ఆయనను అడగాలి అనుకుంటున్నాను. అక్కడి మహిళల దుస్థితి వినడానికి వారికి సమయం లేదు’’ అని ఠాకూర్ విమర్శించారు.
పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చి.. బాత్ రూంలో గుండెపోటుతో యువ టెక్కీ మృతి
మే 3వ తేదీ నుంచి జాతి కలహాలు, హింసను ఎదుర్కొంటున్న మణిపూర్ లో రెండు రోజుల పాటు ప్రతిపక్ష కూటమికి చెందిన 21 మంది సభ్యుల ప్రతినిధి బృందం పర్యటించింది. శనివారం మొదలైన ఈ పర్యటన ఆదివారం ముగిసింది. ఈ బృందంలో కాంగ్రెస్ కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, కె.సురేష్, ఫూలో దేవి, జేడీయూకు చెందిన రాజీవ్ రంజన్ లలన్ సింగ్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుస్మితా దేవ్. డీఎంకే నుంచి కనిమొళి. సీపీఐకి చెందిన సంతోష్ కుమార్.. సీపీఐ(ఎం) నుంచి ఏఏ రహీమ్, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా; ఎస్పీకి చెందిన జావేద్ అలీఖాన్.. జేఎంఎంకు చెందిన మహువా మాజి. ఎన్సీపీకి చెందిన పీపీ మహ్మద్ ఫైజల్.. జేడీయూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, ఐయూఎంఎల్ కు చెందిన ఈటీ మహ్మద్ బషీర్, ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్.. ఆప్ కు చెందిన సుశీల్ గుప్తా. శివసేన (యూబీటీ)కి చెందిన అరవింద్ సావంత్, వీసీకేకు చెందిన డి.రవికుమార్ తో పాటు తోల్ తిరుమావళవన్, ఆర్ ఎల్ డీకి చెందిన జయంత్ సింగ్ ఉన్నారు.