సారాంశం

అమలాపురం ఘటనలో  నమోదైన  కేసులను ఎత్తివేయాలని  రాష్ట్ర ప్రబుత్వం  నిర్ణయం తీసుకుంది. 

అమకావతి: అమలాపురం ఘటనలో  నమోదైన కేసుల.ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఈ విషయమై   మంత్రుల, అధికారులతో  సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష లో  కేసులను  ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

కోనసీమ జిల్లా సాధన సమితి  పేరుతో  2022 మే మాసంలో  అమలాపురంలో  జరిగిన  ధర్నా  హింసాత్మకంగా మారింది.  మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే  సతీష్  ఇంటికి  ఆందోళనకారులు  నిప్పు పెట్టారు. రోడ్లప  వెళ్తున్న బస్సులకు నిప్పు పెట్టారు. అమలాపురం అల్లర్లను  అదుపు చేసేందుకు  ఇతర  ప్రాంతాల  నుండి   అదనపు పోలీస్ బలగాలను రప్పించారు.   ఉఏ్దేశ్యపూర్వకంగానే  ఈ అల్లర్లకు పాల్పడ్డారని  అప్పట్లో  ఆరోపనలు వచ్చాయి.  ఈ అంశంపై  అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు  చేసుకున్నాయి.  వందలాది మందిపై  ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి.  ఈ కేసులను  ఉపసంహరణ  చేసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుందని  రాష్ట్ర మంత్రి విశ్వరూప్ మంగళవారంనాడు  ప్రకటించారు. 

కోనసీమ జిల్లాకు  అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడాన్ని  నిరసిస్తూ  కోనసీమ పేరుతో  జిల్లా  ఉండాలని  ఆందోళనలు  సాగాయి. కలెక్టరేట్ ముందు  ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  ఈ ఆంోళన  హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే