శ్రీరామనవమి వేడుకల సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరకుండా చూడాలని, ఈ అల్లర్లలో బాధితులకు నష్టపరిహారం అందించేలా ఆయా రాష్ట్రాలను ఆదేశించాలని ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన శ్రీరామనవమి హింసను హిందువులపై ముందస్తు ప్రణాళిక, విద్వేష నేరాలుగా అభివర్ణిస్తూ లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, దాడులకు బాధ్యులైన ముస్లింలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
భారీ ఐఈడీ పేలుడు: ఐదుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
స్వతంత్ర భారతంలో హిందువులు శాంతియుతంగా మతపరమైన ఊరేగింపులు నిర్వహించడానికి, వారి ఆచార వ్యవహారాలను పాటించడానికి అనుమతించకపోవడం దురదృష్టకరమని, ముస్లింల సమూహం దీనికి విఘాతం కలిగిస్తోందని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆ సంస్థ తన పిటిషన్ లో పేర్కొంది. బాధితులకు జరిగిన నష్టాన్ని నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలని ఆదేశించాలని కోరింది.
న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్ లో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి, ఆ మరుసటి రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన డాక్యుమెంటరీ, వీడియో రికార్డింగులు ఆ సంస్థ అందించింది. దేశంలోని ప్రతీ పౌరుడికి శాంతియుత పద్ధతిలో బహిరంగ రహదారుల గుండా మతపరమైన ఊరేగింపు నిర్వహించే హక్కు ఉందని, అలాంటి ప్రాంతాల్లో ఇతర సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నంత మాత్రానా ఆ ఊరేగింపును నిరోధించలేమని పేర్కొంది.
పెరుగుతున్న కరోనావైరస్ వ్యాప్తి.. హాస్టల్లో 19 మంది బాలికలకు పాజిటివ్
ముస్లింలలో ఓ వర్గం హిందూ పండుగలపై ద్వేషం కలిగి ఉందని, కాబట్టి హిందువుల మతపరమైన ఊరేగింపులో ఈ దాడి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని, దీని వల్ల ఇలాంటి విద్వేష నేరాలు జరుగుతున్నాయని పిటిషన్ పేర్కొంది. ముస్లిం కమ్యూనిటీ సభ్యులు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఊరేగింపుపై రాళ్లు రువ్వడం ద్వారా విద్వేష నేరాలకు పాల్పడ్డారని ఆరోపించింది. విద్వేష నేరాలను తగ్గించడానికి నివారణ, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తెహ్సీన్ పూనావాలా తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు ధిక్కరించాయని ఆ హిందూ సంస్థ ఆరోపించింది.
విద్వేషపూరిత నేరాలను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైనందునే శ్రీరామనవమి రోజున అల్లర్లు జరిగాయని పిటిషన్ లో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఇంటెలిజెన్స్ సేవలను పెంచాలని పిటిషన్ లో కోరారు. ఏదైనా శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి హింసా జరగకుండా భవిష్యత్తులో ముందస్తు చర్యలు తీసుకునేలా రాష్ట్రాలను ఆదేశించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని పిటిషన్ కోరింది.
