Manipur blast: మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని ఫుంగ్రేటాంగ్, వ్యూల్యాండ్ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. 

5 injured in Manipur IED blast: మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని ఫుంగ్రేటాంగ్, వ్యూల్యాండ్ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మణిపూర్ లో సోమవారం (ఏప్రిల్ 3) సాయంత్రం జరిగిన భారీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్రేటాంగ్, వ్యూల్యాండ్ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురు మణిపురేతరులు ఉన్నారు. గాయ‌ప‌డిన వారిలో నలుగురు దుకాణదారులు, ఒక బండి పుల్లర్ ఉన్నారని అధికార వ‌ర్గాలు తెలిపాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఉఖ్రుల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు: పోలీసులు

ఈ ఐఈడీ పెలుడులో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ ప్రసాద్, మంగళ్ మహతన్ లను ప్రత్యేక చికిత్స కోసం ఇంఫాల్ లోని ఆసుపత్రికి తరలించారు. వీరి వీపు, కాళ్లకు తీవ్ర‌ గాయాలయ్యాయనీ, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగతా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఇదే త‌ర‌హా ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి.. న‌లుగురికి గాయాలు 

రాష్ట్రంలో ఇదివ‌ర‌కు ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 2022 మేలో సెంట్రల్ మణిపూర్లోని తౌబాల్ జిల్లాలోని కమ్యూనిటీ హాల్లో ఐఈడీ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఐఈడీని పేల్చడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఐదుగురు కార్మికులను ఓ ప్రైవేటు సంస్థ నియమించిందని స‌మాచారం.