న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాత ఇనుము డీలర్  కూడ తనపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఉన్నట్టుగా పోలీసులకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు మాసాల క్రితం ఉజ్బెకిస్తాన్ నుండి ఈ మహిళ వచ్చింది. ఢిల్లీలోని గుర్గావ్ లో ఉంటుంది.దక్షిణ ఢిల్లీలోని మసూద్‌పూర్‌లో కలవాలని ఆమెకు పాత ఇనుము డీలర్ కోరాడు. కారులో ఆమెను తీసుకెళ్లాడు.

అతడితో పాటు  మరో ఇద్దరు కూడ కారులో ఉన్నారు. ఓ ఫ్లాట్‌లోకి ఆమెను తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. తాను ప్రతిఘటిస్తే తనపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.

తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు సమీపంలోని ఓ ఇంటిలో తనను ఉంచి నిందితులు వెళ్లిపోయారని బాధితురాలు చెప్పారు. తన స్నేహితులు తనను ఎయిమ్స్ లో చేర్పించారని బాధితురాలు చెప్పారు. 

నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.