Asianet News TeluguAsianet News Telugu

UP BJP Jan Vishwas Yatra: యూపీ లో బీజేపీ జన్ విశ్వాస్ యాత్ర.. ఆరో చోట్ల ప్రారంభం

UP Assembly Elections 2022: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ద‌మ‌వుతోంది. ప్రజల మద్దతు కూడగట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాష్ట్రంలోని ప‌లు న‌గ‌రాల్లో జన్ విశ్వాస్ యాత్రను ప్రారంభించ‌నున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు.
 

UP Assembly Elections 2022: BJP to launch five Jan Vishwas Yatras in Uttar Pradesh start today
Author
Hyderabad, First Published Dec 19, 2021, 11:55 AM IST

UP Assembly Elections 2022:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ఓ ముంద‌డుగు వేసింది. ఇప్ప‌టి నుంచే.. విస్తృత స్థాయిలో ప్ర‌చారాన్ని ప్రారంభించాలని భావించింది. నేటి నుండి UPలో జన్ విశ్వాస్ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రారంభిస్తారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా ‘జన్ విశ్వాస్ యాత్ర’ పేరుతో ఆరు చోట్ల  బీజేపీ ప్ర‌చారాన్ని ప్రారంభించనున్నారు. యూపీలో ప్ర‌ధాన న‌గ‌రాలైన‌..  బిజ్నోర్, మథుర, ఝాన్సీ, ఘాజీపూర్, అంబేద్కర్ నగర్ ల్లో ఈ యాత్రలు ప్రారంభమవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ శనివారం తెలిపారు. 

Read Also: అలా చేస్తే.. శాశ్వతంగా రాజకీయాలకు దూర‌మ‌వుతా.. Paritala Sriram సంచలన వ్యాఖ్యలు

ఈ నేప‌థ్యంలో లోహియా అంబేద్కర్ నగర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ స‌భ‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్ష‌డు జ‌గ‌త్ ప్రకాష్ నడ్డా, కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర, కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కూడా పాల్గొంటారు.  అనంతరం ఇక్క‌డ నుంచే బీజేపీ జాతీయ అధ్య‌క్ష‌డు జ‌గ‌త్ ప్రకాష్ నడ్డా యాత్రను ప్రారంభిస్తారు.
 
ఇక రెండో యాత్ర‌ను మ‌ధుర‌ధామ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధురధామ్‌ నుంచి ప్రారంభిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌, ఎంపీ రాజ్‌వీర్‌ సింగ్ ప్రారంభం కానున్న‌ది. కలిసి యాత్ర కొనసాగనుంది. మధుర ధామ్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర‌.. అలీఘర్, ఎటా, మెయిన్‌పురి, ఆగ్రా, హత్రాస్, ఫిరోజాబాద్, కస్గంజ్, బదౌన్, షాజహాన్‌పూర్, పిలిభిత్, బ‌రేలీ మీదుగా సాగనున్న‌ది.  

Read Also: Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

మూడో యాత్ర..  ఝాన్సీ నుంచి ప్రారంభం కానున్న‌ది. ఈ యాత్ర‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ దినేష్‌ శర్మ ప్రారంభించ‌నున్నారు. వీరితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు బీఎల్‌ వర్మ, నిరంజన్‌ జ్యోతి లు పాల్గొనున్నారు. ఝాన్సీ నుండి ప్రారంభం కానున్న ఈ యాత్ర లలిత్‌పూర్, మహోబా, చిత్రకూట్, ఫతేపూర్, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, కాన్పూర్ దేహత్, ఫరూఖాబాద్, కాన్పూర్ 
 మీదుగా సాగ‌నున్న‌ది.  

ఇక నాల్గవ యాత్ర బిజ్నోర్‌లోని బిదుర్ కుటి నుండి ప్రారంభం కానున్న‌ది. ఈ యాత్ర‌ను మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్‌లు పాల్గొనున్నారు. ఈ యాత్ర  బిజ్నోర్ నుండి ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, బాగ్‌పట్, షామ్లీ, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, మొరాదాబాద్, సంభాల్ మీదుగా సాగును.  

Read Also: 65 ఏళ్లు.. 43 పుష్ అప్‌లు.. కాలేజీ ఫెస్ట్‌లో బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ హల్‌చల్
 
ఐదవ యాత్ర బల్లియా నుండి ప్రారంభమవుతోంది. ఈ యాత్ర‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ప్రారంభించ‌గా.. ఇందులో స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ లు పాల్గొనున్నారు. బల్లియా నుంచి మౌ, అజంగఢ్, డియోరియా, కుషీనగర్, మహరాజ్‌గంజ్, సిద్ధార్థనగర్, సంత్ కబీర్ నగర్, బస్తీ వరకు ప్రయాణం సాగుతుంది.

ఆరో యాత్ర ఘాజీపూర్ నుంచి ప్రారంభం కానున్న‌ది. ఈ యాత్రలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ హాజరవుతారని తెలిపారు. ఘాజీపూర్ నుండి చందౌలీ వరకు సోన్‌భద్ర, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్, కౌశాంబి, భదోహి, వారణాసి, జౌన్‌పూర్, సుల్తాన్‌పూర్, అమేథీ వ‌ర‌కు సాగ‌నున్న‌దని రాష్ట్ర బీజేపీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios