Asianet News TeluguAsianet News Telugu

Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

Priyanka Gandhi: వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. యూపీ ర్యాలీలో పాల్లొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏండేండ్ల పాలనలో ఏం ఉద్దరించిందో చెప్పమంటూ ప్రశ్నించారు. 
 

What Did They Do In 7 Years? Priyanka Gandhi Charges At PM Modi In UP's Amethi
Author
Hyderabad, First Published Dec 19, 2021, 11:38 AM IST

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంగ గాంధీ వాద్ర మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ ఏడేండ్ల పాలనలో ఏం ఉద్దరించిందో చెప్పాలంటూ ప్రధాని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అటు కేంద్రంలో, ఇటు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అబద్దాలు చెబుతూ.. ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ రాష్టం కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దానిలో భాగంగా ప్రియాంక గాంధీ తన సోదరుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించారు.  అక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలపై ఆమె ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. ప్రధాన నరేంద్ర మోడీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ పై మండిపడ్డారు. గ‌త ఏడు సంవ‌త్స‌రాల్లో అమేథీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. కేవ‌లం కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే, బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అభివృద్ధి ప‌నులు చేశార‌ని ఆమె ఆరోపించారు.

Also Read: Coronavirus: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

కరోనా వైరస్ ను నిర్వహించడం, దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుదల, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి పెరగడం, సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగం వంటి పలు కీలక అంశాలను ప్రియాంగ గాంధీ ప్రస్తావించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది మొద‌లు, బీజేపీ అబ‌ద్ధాలాడుతూనే ఉంద‌ని ఆమె విమ‌ర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నదనీ, బీజేపీ పాల‌న‌లో నిత్యావ‌స‌ర ధ‌రలు విప‌రీతంగా పెరిగిపోయాయ‌నీ, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. గతంలో ఎప్పడుూ లేనంతగా  కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ లు పాలన మొదలు పెట్టినప్పటి నుంచి అన్నింటి ధరలు గరిష్టంగా పెరిగాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ పై నిర్లక్యంగా కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ బీజేపీ ప్ర‌భుత్వం పెద్ద‌గా చేసిందేమీ లేద‌ని, ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా అనేక మంది త‌మ ప్రాణాలు కోల్పోయార‌ని ఆమె విమ‌ర్శించారు. తాము గ‌న‌క అధికారంలోకి వ‌స్తే రైతు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని, 20 ల‌క్షల ఉద్యోగాల క‌ల్ప‌న‌కు శ్రీకారం చుడ‌తామ‌ని ప్రియాంక హామీ ఇచ్చారు. గత 70 సంత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని పదే పదే బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. ఏడేండ్లుగా అమేథీలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి.. వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

Also Read: Covid Third wave: జనవరిలో కరోనా థర్డ్ వేవ్.. కొత్తగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం !

దేశంలో పెరుగుతున్న ధరల కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులను చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఎందుకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కొత్తగా 20 లక్షల మంది యువతకు ఉపాధిని కల్పిస్తామని ఉద్యోగాల హామీని సైతం ఇచ్చారు. “కాంగ్రెస్ రైతులందరికీ మరియు చిన్న వ్యాపారులందరికీ రుణాలను మాఫీ చేస్తుంది, విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తుంది, 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తుంది. కోవిడ్ -19 కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ₹ 25,000 రూపాయలు ఇస్తుంది” అని ప్రియాంక గాంధీ చెప్పారు. అలాగే, "రోగాల విషయంలో, ప్రభుత్వం ₹ 10 లక్షల ఆరోగ్య సంరక్షణను అందజేస్తుంది . రాజకీయంగా మహిళలకు సాధికారత కల్పించడానికి, వారికి 40 శాతం టిక్కెట్లు  కేటాయిస్తాం. బాలికా విద్యార్ధులకు వారి సాధికారత కోసం, వారి భద్రత కోసం స్మార్ట్‌ఫోన్‌లు, స్కూటీలు  అందిస్తాం" అని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ సైతం బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 

Also Read: Rahul Gandhi: గంగ‌లో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్త‌రు.. మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు 

 

Follow Us:
Download App:
  • android
  • ios