అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ ను గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి) కి ఇస్తే.. శాశ్వతంగా తాను రాజకీయాలకు దూర‌మ‌వుతాన‌ని సంచ‌ల‌న ప్రకటించారు. 

అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) సంచలన ప్ర‌క‌ట‌న చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ ను గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి) కి ఇస్తే.. శాశ్వతంగా రాజకీయాల‌కు దూర‌మ‌వుతాన‌ని సంచ‌ల‌న ప్రకటించారు. ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా? నేనే కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ అభివృద్దికి కష్ట‌ప‌డుతున్నాని .. పార్టీ కూడా క‌ష్ట‌ప‌డి పని చేస్తేనే సీటు ఇస్తోంద‌ని భావిస్తున్నని అన్నారు. అయితే.. నేను చంద్రబాబుకి చెప్పేది ఒక్క‌టేన‌నీ, కాదు కూడదు అని నాకు కాకుండా వేరే వారికి టీడీపీ తరఫున టికెట్ ఇస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి ప‌రోక్షంగా పరిటాల శ్రీరామ్ సంచ‌నల వ్యాఖ్య‌లు చేశారు. ఇక టీపీడీ అధికారంలోకి వ‌స్తే.. విదేశాల్లో దాక్కున్నా వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తామన్నారు. టీడీపీ సభలకు వస్తున్న ప్రజలను వాలంటీర్లు ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచిది కాదని వాలంటీర్లకు కూడా పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొన్నటివరకు రాప్తాడుకే పరిమితమైన ప‌రిటాల శ్రీరాం.. ఇప్పుడిప్పుడే ధర్మవరం పై ఫోక‌స్ చేస్తున్నాడు. క్ర‌మంగా కార్య‌క్ర‌మాలు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను ద‌గ్గ‌ర‌వుతున్నారు.

Read Also: కర్నూలు వైసీపీలో వేడెక్కిన రాజకీయం : జడ్పీ ఛైర్మన్ రాజీనామా.. జగన్ ఒత్తిడితోనేనా..?

గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి టీడీపీ త‌రుఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ధర్మవరం బాధ్యతలు చూడాలని పరిటాల కుటుంబాన్ని చంద్రబాబు ఆదేశించారు. అప్పటి నుంచి శ్రీ‌రామ్ ధర్మవరం ఇన్‌చార్జ్ వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. పార్టీ కార్యక్రమాలు, తప్పని పరిస్థితుల్లో అడపాదడపా చుట్టపుచూపుగా వచ్చివెళ్లారు.

Read Also: మందు బాబులకు శుభవార్త: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. అందుబాటులోకి అన్ని రకాల బ్రాండ్‌లు

ఈ త‌రుణంలో పరిటాల శ్రీరాం ధర్మవరం నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. త‌రుచూ.. స్థానిక కార్య‌కర్త‌ల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. ఈ త‌రుణంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపైనా ఘాటైన వాఖ్యలు చేస్తూ.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. శ్రీరాం యాక్టివ్ కావడంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పలురకాలుగా చర్చ జరుగుతోంది.