Asianet News TeluguAsianet News Telugu

మహిళా రిజర్వేషన్ బిల్లు .. సోనియా గాంధీ వ్యాఖ్యలు, స్మృతీ ఇరానీ కౌంటర్

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. వారు పేపర్లు, ప్రసంగాల వరకే పరిమితం అయ్యారని అందుకే కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. 

union minister Smriti Irani's swipe at Sonia Gandhi on women's bill ksp
Author
First Published Sep 20, 2023, 4:26 PM IST

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. కాంగ్రెస్ హయాంలో మహిళల గురించి ఆలోచించలేదన్నారు. వారు పేపర్లు, ప్రసంగాల వరకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. 

అంతకుముందు సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘భారత జాతీయ కాంగ్రెస్ తరపున.. నేను మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం 2023)కు మద్దతుగా నిలబడతాను’’ అని చెప్పారు. వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందని అన్నారు. మహిళలు వారి స్వార్దం గురించి ఏనాడూ ఆలోచించరని చెప్పారు. మహిళల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని అన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారని గుర్తుచేశారు. సరోజిని నాయుడు, సుచేత కృపలానీ, అరుణ అసఫ్ ఆలీ, విజయలక్ష్మి పండిత్, వంటి వారెందరో దేశం కోసం పోరాడారని గుర్తుచేశారు. 

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రకటించిన సోనియా.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్..

ఇది నా జీవితంలో కూడా భావోద్వేగ ఘట్టం. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నాయకులు ఉన్నారు. రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ కల  పూర్తి అవుతుంది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. 

మహిళలు ఇప్పటికే ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని.. ఇప్పుడు వారు ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. కుల గణన చేపడితే.. ఈ బిల్లు మెరుగైన అమలుకు దారితీస్తుందని అన్నారు. బిల్లు మరింత మెరుగ్గా అమలు కావాలంటే కుల గణన అవసరమని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మహిళలను కూడా చేర్చాలని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios