Asianet News TeluguAsianet News Telugu

ఇది మోదీ ప్రభుత్వం మరో స్పూర్తిదాయకమైన విజయం.. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రయత్నంలో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) .. ఇప్పుడు దేశం ఆర్థికంగా బలంగా పుంజుకోవడం ద్వారా మరో అత్యంత స్పూర్తిదాయకమైన విజయాన్ని అందుకున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) అన్నారు.

Union Minister rajeev chandrasekhar Praises Modi govt over says strong Economic rebound
Author
New Delhi, First Published Nov 2, 2021, 11:47 AM IST

కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రయత్నంలో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) .. ఇప్పుడు దేశం ఆర్థికంగా బలంగా పుంజుకోవడం ద్వారా మరో అత్యంత స్పూర్తిదాయకమైన విజయాన్ని అందుకున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) అన్నారు. 2020లో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది.. అయితే పెట్టుబడులు, వృద్దిలో కఠిన పరిస్థితులను అధిగమించి 2021 అక్టోబర్‌లో పెరుగుద సాధించిన నిబద్దత, సామర్థ్యం గల నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ నెలలో భారీగా GST వసూళ్లు జరగడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేశారు.

 

మరోవైపు Congress నాయకులపై కూడా కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం చాలా చిన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం, రాజన్‌లు దేశ ఆర్థిక వ్యవస్తను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేప్పుడు.. ఒక్కసారి 2008 నాటి పరిస్థితులను, 2021తో పో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. 

Also read: NCP వర్సెస్ BJP: దీపావళి తర్వాత బాంబు పేలుస్తా.. ఎన్‌సీపీ మంత్రిపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఫైర్

భారతదేశం ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు కూడా పుంజుకుంటున్నాయి. ఈ వసూళ్లు వరుసగా నాలుగో నెల రూ. లక్ష కోట్లను అధిగమించాయి. అక్టోబర్ నెలలో రూ. 1,30,127 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ వాటా రూ. 67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో కలిపి), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో కలిపి) ఉన్నట్టుగా వెల్లడించింది.

Also read: విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక సమీక్ష.. ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్న మోదీ..

2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం. ఈ ఏడాది అక్టోబర్ నెల ఆదాయం.. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ.

Follow Us:
Download App:
  • android
  • ios