Asianet News TeluguAsianet News Telugu

పీఎం - శ్రీ ప‌థ‌కానికి కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం.. 18 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ది..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పీఎం-శ్రీ అనే పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం వల్ల దేశ వ్యాప్తంగా 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. 

Union Cabinet approves PM-SHRI Scheme 18 lakh students benefited..
Author
First Published Sep 8, 2022, 11:42 AM IST

ప్రధాన మంత్రి స్కూల్స్ రైజింగ్ ఇండియా (PM SHRI పాఠశాలల పథకం) పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప‌థ‌కం కింద దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా ప్రమోట్ చేస్తారు. సదారత్‌లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు.

భార‌త ప‌ర్య‌ట‌నలో బంగ్లా ప్ర‌ధాని.. అఖండ భారత్ వ్యాఖ్య‌లు చేసిన అసోం సీఎం

సమావేశం అనంతరం కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 2022-2027 మధ్య ఐదేళ్ల పాటు పీఎం-శ్రీ పాఠశాల పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీని కింద రూ. 27,360 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు. దేశ వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 

సట్లెజ్-యమునా వివాదం:డర్టీ పాలిటిక్స్ ఆపండి.. పంజాబ్, హర్యానాకు నీరు అందేలా చూడండి: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో ఎంపిక చేసి వాటిని డెవ‌ల‌ప్ చేస్తారు. ఈ విష‌యాన్ని ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. ఈ పథకం కింద ప్రతి బ్లాక్ స్థాయిలో కనీసం ఒక మోడల్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని పర్యవేక్షించేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ‘పీఎం-శ్రీ’ పాఠశాలల్లో విద్యాసమీక్ష కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ (టీచర్స్ డే)న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై సమాచారం అందిస్తూ మాట్లాడారు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు నేను కొత్త చొరవను ప్రకటిస్తున్నాను. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-శ్రీ) కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి అప్‌గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ మోడల్ స్కూళ్లుగా మారనున్నాయి.’’ అని పేర్కొన్నారు.

ఈ ప‌థ‌కం కింద విద్యార్థులు, పాఠశాలలు రెండూ స్మార్ట్‌గా మారుతాయని ప్ర‌ధాని తెలిపారు. పాఠశాలల్లో విద్యను అందించడానికి PM-శ్రీ ఒక ఆధునిక, పరివర్తన, సంపూర్ణమైన మార్గం అని మోడీ నొక్కి చెప్పారు. వీటిలో ఆవిష్కరణ, అభ్యాసంపై దృష్టి సారించి విద్యను అందించడానికి ప్రాధాన్యత అందిస్తార‌ని పేర్కొన్నారు. ‘‘ఇది లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, క్రీడలు, ఆధునిక మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెడుతుంది ’’ అని ఆయన చెప్పారు.

భార‌త్ జోడ్ యాత్ర: నీట్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ

కాగా.. ఈ పథకం కింద అభివృద్ధి చెందిన పాఠ‌శాల‌లు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో సహాయపడతాయి. ఆయా రంగాలలో అత్యుత్తమ ప్ర‌తిభను క‌నబ‌రుస్తాయి. ఈ పాఠశాలల్లో అవలంబించే విద్యా విధానం ఆచరణాత్మకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా, ఉత్సుకత, అభ్యాస కేంద్రంగా ఉంటుంది. వీటిలో స్మార్ట్ క్లాస్‌రూమ్, లైబ్రరీ, స్కిల్ ల్యాబ్, ప్లేగ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వంటి అన్ని ర‌కాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios