Asianet News TeluguAsianet News Telugu

సట్లెజ్-యమునా వివాదం:డర్టీ పాలిటిక్స్ ఆపండి.. పంజాబ్, హర్యానాకు నీరు అందేలా చూడండి: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

సట్లెజ్-యమునా వివాదం: పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాల మట్టం తగ్గిపోతున్నందున రెండు రాష్ట్రాలకు నీరు అవసరమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలు గొడవపడేలా చేయవద్దనీ, ఆయా  రాష్ట్రాల‌కు నీళ్లు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.
 

Sutlej Yamuna dispute : Stop politics.. Ensure Punjab, Haryana get water: Kejriwal fires on Centre
Author
First Published Sep 8, 2022, 11:11 AM IST

చండీగఢ్: దశాబ్దాల నాటి సట్లెజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కాలువ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్, హర్యానాలకు నీళ్లివ్వడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. హర్యానాలోని హిసార్‌లో తన పార్టీ 'మేక్ ఇండియా నంబర్ 1' ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సట్లెజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ సమస్యను పరిష్కరించడంలో పంజాబ్ ప్రభుత్వం సహకరించడం లేదు అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిన ఒక రోజు తర్వాత ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలు గొడవపడేలా చేయవద్దని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాల మట్టం తగ్గిపోతున్నందున రెండు రాష్ట్రాలకు నీరు అవసరమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలు గొడవపడేలా చేయవద్దనీ, ఆయా  రాష్ట్రాల‌కు నీళ్లు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

కేజ్రీవాల్‌తో పాటు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎస్‌వైఎల్ కెనాల్ వివాదంపై హర్యానా ముఖ్య‌మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవడానికి ఎలాంటి సంకోచం లేదని అన్నారు. ఈ వివాదం ప‌రిష్కారం కావాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ అంశంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని, రెండు రాష్ట్రాలకు నీళ్లు అందించేందుకు హామీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌కు వెళ్లి సట్లెజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కాలువ వివాదంపై అనుమతించబోమని, హర్యానాకు రాగానే కాలువ నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నారని కాంగ్రెస్, బీజేపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ డర్టీ రాజకీయాలు గత 70 ఏళ్లలో భారతదేశాన్ని నంబర్ వన్‌గా మార్చలేకపోయాయని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాల మట్టం తగ్గిపోతున్నందున రెండు రాష్ట్రాలకు నీరు అవసరమని ఆయన అన్నారు.

హర్యానా, పంజాబ్‌లకు నీరు అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని హిసార్‌లో మీడియాతో కేజ్రీవాల్ అన్నారు. "కేంద్ర ప్రభుత్వ పని ఏమిటి? ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం పోరాడేలా చేయడం కేంద్రం పని కాదు. మనం పరస్పరం పోరాడుతూనే ఉంటే, భారతదేశం ఎలా ముందుకు సాగుతుంది" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హర్యానా, పంజాబ్‌లకు నీరు అందే అవకాశం ఉందని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. "పంజాబ్, హ‌ర్యానాకు తగిన నీటి ఏర్పాటును నిర్ధారించాలని నేను ప్రధాన్ మంత్రి-జీకి విజ్ఞప్తి చేస్తున్నాను. అతని వద్ద పరిష్కారం లేకపోతే, అతను నాకు ఫోన్ చేయమ‌నండి.. నేను దాని గురించి ఆయ‌న‌కు చెబుతాను. ఈ స‌మ‌స్య‌ పరిష్కరించబడాలి" అని  కేజ్రీవాల్ అన్నారు.

ఎస్ వైఎల్ కాలువ  అనేక దశాబ్దాలుగా పంజాబ్-హర్యానా మధ్య వివాదానికి కార‌ణంగా నిలుస్తోంది. పంజాబ్ రావి-బియాస్ నదీ జలాల పరిమాణాన్ని తిరిగి అంచనా వేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదే స‌మ‌యంలో హర్యానా 3.5 మిలియన్ ఎకరాల అడుగుల (MAF) నీటి వాటాను పొందడానికి SYL కాలువను పూర్తి చేయాలని కోరుతోంది. SYL సమస్యపై హర్యానా ముఖ్యమంత్రిని కలవడంలో తనకు ఎలాంటి సమస్య లేకపోయినా, కేంద్రం దానిని పరిష్కరించాలని భ‌గ‌వంత్ మాన్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios