Asianet News TeluguAsianet News Telugu

భార‌త ప‌ర్య‌ట‌నలో బంగ్లా ప్ర‌ధాని.. అఖండ భారత్ వ్యాఖ్య‌లు చేసిన అసోం సీఎం

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Assam  cm Himanta Sarma Controversial Remark Amid Bangladesh PM Visit
Author
First Published Sep 8, 2022, 11:18 AM IST

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండ్ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. మరోసారి చర్చనీయాంశంగా మారారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న నేప‌థ్యంఓ తాను చేసే సంచలన కామెంట్లతో పార్టీకి ఇరుకపెట్టే ప‌నిచేశారు. ఎప్పటిలాగే ఇప్పుడు ఆయ‌న‌ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి. ఇంత‌కీ ఆయన చేసిన వ్యాఖ్య‌లేంటీ? ఎందుకు అంతగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తాయని అనుకుంటున్నారా? ఓ సారి వివ‌రంగా తెలుసుకుందాం.. 

పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం భారత్ జోడో పాద‌యాత్ర‌.. ఇప్ప‌టికే అధికార బీజేపీ ఈ యాత్ర‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యాత్రపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ..  విమ‌ర్శ‌లు గుప్పించారు.  

భారతదేశం ఐక్యంగా ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుండి సౌరాష్ట్ర వరకు మనం ఒక్కటే. కాంగ్రెస్ పార్టీనే  దేశాన్ని భారతదేశం, పాకిస్తాన్‌గా విభజించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. రాహుల్ గాంధీ కుటుంబం (కాంగ్రెస్ పార్టీ)చేసిన తప్పుకు క్షమాపణలు కోరితే..  ప్రయోజనం లేదు. ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఏకం చేసి, అఖండ భారత్‌ను రూపొందించేందుకు కృషి చేయండి," అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది


'అఖండ భారత్.. అనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆలోచన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్,  మయన్మార్‌లను ఏకంగా చేసి.. అవిభక్త భారతదేశం ను రూపొందించాల‌నేది ఆ సంస్థ ల‌క్ష్యం.  

షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న సమయంలో "బంగ్లాదేశ్‌ను భారత్‌తో విలీనం చేయడం"పై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయంగా మారాయి. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ నిన్న బంగ్లాదేశ్ ప్రత్యర్ధులతో చర్చలు జరిపారు. సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు ఏడు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు)పై సంతకాలు చేశాయి.
 
మ‌రోవైపు.. భారతదేశం మా స్నేహితుడనీ, తాను భార‌త్ కు రావ‌డం చాలా ఆనందంగా ఉందనీ,  ప్రత్యేకించి రష్యా-ఉక్రేయిన్ యుద్దం నుంచి బంగ్లా విద్యార్థుల‌కు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుక‌రావ‌డాన్ని, అలాగే క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అందించిన‌  సహకారాన్ని తాము ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటామనీ, ఇరుదేశాల మ‌ధ్య‌ స్నేహపూర్వక సంబంధం కొనసాగాల‌ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హానీనా అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios