Union Budget 2024:40 వేల రైల్వే బోగీలను వందేభారత్ కోచ్ లుగా మార్పు


కేంద్ర ప్రభుత్వం  ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రవేశ పెట్టింది.

Union Budget 2024:40,000 Indian Railways bogies to be converted to Vande Bharat coaches, says Sitharaman lns

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం నాడు  మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. లాజిస్టిక్స్ సామర్ధ్యాన్ని పెంపొందించడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా  మూడు ప్రధాన ఆర్ధిక రైల్వే కారిడార్లను అమలు చేయనున్నట్టుగా  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

also read:ఉపాధికి ఎన్నో అవకాశాలు: కేంద్ర బడ్జెట్ పై మోడీ

అధికంగా ట్రాఫిక్ సాంద్రత గల మార్గంలో  ట్రాఫిక్ రద్దించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది.ఖనిజ, సిమెంట్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లను ఏర్పాటు చేయనుంది  కేంద్రం.సాధారణంగా ఉన్న నలభై వేల బోగీలను వందే భారత్ ప్రమాణాలకు మార్చాలని  కేంద్రం నిర్ణయం తీసుకుంది.2023-24 లో కేంద్ర బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు  మంత్రిత్వ శాఖ రూ. 2.40 లక్షలు కేటాయించింది. ఇది 2013-14 ఆర్ధిక సంవత్సరంలో  చేసిన వ్యయం కంటే  తొమ్మిది రెట్లు ఎక్కువ.

 కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  ఇవాళ వరుసగా ఆరోసారి  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  రైల్వే శాఖకు  ఈ దఫా రూ. 2. 40 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది.  సాధారణ రైల్వే బోగీలను  వందేభారత్ స్థాయికి మార్చుతామని  కేంద్రం హామీ ఇచ్చింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios